ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vangalapudi Anitha: సీఎం జగన్‌పై అనిత ఘాటు వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-07-16T20:24:59+05:30

సొంత బాబాయికి లేని పోని సంబంధాలు అంటగట్టారు.. సొంత చెల్లికే దిక్కు లేదు..మేము ఎంత?. హోం మంత్రి ఇంట్లోనే ఉండి పోతున్నారు. మహిళ సమస్యలను పట్టించుకోవడం లేదు. కొంతమంది వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై (AP CM Jaganmohan Reddy)పై టీడీపీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) విమర్శలు గుప్పించారు.


"సొంత బాబాయికి లేని పోని సంబంధాలు అంటగట్టారు.. సొంత చెల్లికే దిక్కు లేదు..మేము ఎంత?. హోం మంత్రి ఇంట్లోనే ఉండి పోతున్నారు. మహిళ సమస్యలను పట్టించుకోవడం లేదు. కొంతమంది వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. సెప్టెంబర్ నెలలో సీఎం విశాఖకు వస్తామని అంటున్నారు. చెప్పులతో స్వాగతం పలుకుతారు. మహిళా సమస్యలపై మేము పోరాటం చేస్తుంటే...వైసీపీ సోషల్ మీడియా గజ్జి కుక్కలు మోరుగుతున్నాయి. పేటీఎం డాగ్స్ నోటికి వచ్చినట్లు వాగుతున్నాయి. అసభ్యపద జాలాన్ని వాడుతున్నాయి. ఒక మనిషికి పుట్టిన వాడు ఇలా చేయరు. ఊరు పేరు లేని పేపర్లలో నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. నాపై రాయిస్తున్నది భారతి రెడ్డే. ఇదంతా సజ్జల భార్గవ్ రెడ్డి స్క్రిప్ట్‌తోనే జరుగుతుంది నా ఫోటోలను ప్రొఫైల్ పిక్‌లుగా పెట్టుకుంటున్నారు. నాపై అసత్య, అభ్యంతర కరమైన వార్తలు ప్రచురిస్తున్నారు. నేను ఎవర్ని వదిలి పెట్టను. డీజీపీ 6 నెలలుగా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఇలాంటి పోస్టులకు ఏడిచేది లేదు. ఏడిపిస్తాను. 6 నెలలు ఆగండి. జగన్ జైలులో ఉంటారు. పోలీసు వ్యవస్థ మా దగ్గర ఉంటుంది. ప్రతి ఒక్కరినీ గుర్తు పెట్టుకుంటాను. వదిలే ప్రసక్తే లేదు. నేను చదువుకున్న దళిత ఆడ బిడ్డను. మీరు పెడుతున్న పోస్టులకు భయపడను. నా కొడకల్లారా... మీ ఇష్ట వచ్చినట్లు పోస్టులు పెట్టండి. ఇంకా పెట్టండి. బెదిరేది లేదు. పోలీసులు సుమోటోగా కేసు తీసుకోవాలి. డీజీపీని కోరుతున్నాను. తప్పుడు పోస్టులు పెట్టేవాడుదొరికితే ఇక నుంచి తంతాం." అని అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-07-16T20:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising