ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court: జగన్ సర్కార్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ

ABN, First Publish Date - 2023-06-02T16:25:47+05:30

జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జీవో 115పై హైకోర్టు తీర్పును సుప్రీం సమర్థించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: జగన్ సర్కార్‌కు సుప్రీంకోర్టులో (Supreme Court) ఎదురుదెబ్బ తగిలింది. జీవో 115పై ఏపీ హైకోర్టు (AP highcourt) తీర్పును సుప్రీం సమర్థించింది. వైజాగ్ వ్యాపారవేత్త కాట్రగడ్డ లలితేశ్ కుమార్‌కు మర్రిపాలెంలో 17135 చదరపు మీటర్ల భూమిని వెనక్కి తీసుకుంటూ జీవో 115ని ఏపీ ప్రభుత్వం (AP Government) జారీ చేసింది. జీవో 115ని సవాల్ చేస్తూ లలితేశ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా... జీవో 115ని కొట్టివేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ మొదట తీర్పును వెల్లడించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సీజేఐ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సమర్ధించింది. దీంతో హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. దీనిపై ఈరోజు (శుక్రవారం) న్యాయమూర్తులు దీపాంకర్ దత్తా, పంకజ్ మిట్టల్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. జీవో 115ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం కోర్టు సమర్థించింది. కాట్రగడ్డ లలితేశ్ కుమార్‌కు కేటాయించిన స్థలాన్ని వెనక్కు తీసుకోవాలనుకున్న ఏపీ ప్రభుత్వం నిర్ణయం సరికాదని సుప్రీం ధర్మాసనం తెలిపింది. మీరే స్థలాన్ని కేటాయించి మళ్లీ మీరే వెనక్కి తీసుకుంటారా? అంటూ ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది.

Updated Date - 2023-06-02T16:27:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising