Pasupuleti: కడిగిన ముత్యంలా చంద్రబాబు వస్తారు.. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోంది..
ABN, First Publish Date - 2023-09-23T19:30:38+05:30
వైసీపీ సర్కారుపై (YCP GOVT) పసుపులేటి సుధాకర్ (Pasupuleti Sudhakar) విమర్శలు గుప్పించారు.
నెల్లూరు: వైసీపీ సర్కారుపై (YCP GOVT) పసుపులేటి సుధాకర్ (Pasupuleti Sudhakar) విమర్శలు గుప్పించారు.
"ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. అంబేద్కర్ రాజ్యాంగం కోసం మనమంతా పోరాటం చేయాలి. సత్యహరిశ్చంద్రుడిలా చంద్రబాబు పరీక్ష ఎదుర్కొంటున్నారు. కడిగిన ముత్యంలా చంద్రబాబు తిరిగొస్తారు. ఆవు చేలో మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా?. అన్న చందంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయి. కావలిలో ఇసుక, గ్రావెల్, మట్టి అక్రమాలకి అడ్డూ అదుపులేకుంది. అక్రమార్కులకు బుద్ది చెప్పే రోజు తొందరలోనే ఉంది." అని పసుపులేటి సుధాకర్ విమర్శించారు.
Updated Date - 2023-09-23T19:33:20+05:30 IST