ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anitha Arrest: విజయవాడలో వంగలపూడి అనిత అరెస్ట్

ABN, First Publish Date - 2023-08-30T10:58:57+05:30

టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

విజయవాడ: టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితను (TDP Leader Vangalapudi Anitha) విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనితను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పకుండా కారులోనే పలు ప్రాంతాలకు తిప్పుతున్న పరిస్థితి. అయితే అనిత అరెస్ట్‌పై టీడీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు. రాఖీ పండుగ సందర్భంగా వేరే కార్యక్రమంలో పాల్గొనేందుకు విజయవాడ వస్తున్న అనితను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అనిత కూడా టీడీపీ చేపట్టిన ఇసుక ఉద్యమంలో పాల్గొనేందుకు వచ్చారని పోలీసులు చెబుతున్నారు.


మరోవైపు ఏపీలో వైసీపీ ఇసుక దోపిడిపై టీడీపీ పోరుబాట పట్టింది. గత రెండు రోజులుగా ఇసుక రీచ్‌లు, మండల కేంద్రాల వద్ద సత్యాగ్రహ దీక్షలు చేపట్టింది. ఈరోజు(బుధవారం) రాష్ట్ర మైనింగ్ కార్యాలయంలో వైసీపి దోపిడీ విధానంపై వినతి పత్రాన్ని అందించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించారు. అయితే ఇబ్రహీంపట్నంలోని రాష్ట్ర మైనింగ్ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. మైనింగ్‌కు వెళ్లే రాష్ట్ర కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఐడెంటీ కార్డులను పరిశీలించి మరీ పోలీసులు కార్యాలయంలోనికి పంపిస్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నేతలతో పాటు, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని టీడీపీ నేతలను ముందస్తు చర్యగా హౌస్‌ అరెస్ట్ చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో అయినా మైనింగ్ కార్యాలయానికి వెళ్లి తమ నిరసన వ్యక్తం చేస్తామని టీడీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

Updated Date - 2023-08-30T11:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising