ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Budda Venkanna: చంద్రబాబు, పవన్ కలిస్తే మీకెందుకు భయం.. వైసీపీకి బుద్దా వెంకన్న కౌంటర్

ABN, Publish Date - Dec 18 , 2023 | 02:09 PM

Andhrapradesh: టీడీపీ అధినేత చంద్రబాబు - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి వైసీపీ నేతల విమర్శలపై టీడీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జి బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) భేటీపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ నేతలకు ఉత్తరాంధ్ర టీడీపీ ఇంఛార్జి బుద్ధా వెంకన్న (TDP Leader Budda Venkanna) గట్టి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు, పవన్ కలిస్తే వైసీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎందుకు విమర్శలు చేస్తున్నారని ఆగ్రహించారు. ‘‘ఇలానే మాట్లాడితే మీకు బడితే పూజ తప్పదు’’ అని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. మూడు నెలలు ఆగండి.. వాగే వారందరి నోళ్ళు మూతపడతాయన్నారు. కొడాలి నాని లాంటి వాళ్ళు నోరు అదుపులో పెట్టుకోకపోతే త్వరలోనే బుద్ధి వచ్చేలా టీడీపీ కేడర్ జవాబు చెబుతుందన్నారు. ఇప్పటికే లోకేష్ రాసిన రెడ్ డైరీలో కొందరి పేర్లు ఉన్నాయని... మరి కొందరి పేర్లు కూడా ఎక్కుతాయన్నారు. మూడు నెలలు తరువాత గన్‌మెన్‌లు కూడా ఉండరని... జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు. టీడీపీ, జనసేన పొత్తు ఎప్పుడో కుదిరిందని... ఆ విషయం తెలుసుకొని మాట్లాడాలని బుద్దా వెంకన్న వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Dec 18 , 2023 | 02:21 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising