ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: జగన్‌, మంత్రి అమర్నాథ్‌పై బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-11T18:58:15+05:30

: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana) విమర్శలు గుపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana) విమర్శలు గుపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పాలన ఉన్నంతకాలం ఏపీది అధోగతే అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సంచలన ఆరోపణళు చేశారు. మరో వైపు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై బండారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి అమర్నాథ్ (Minister Amarnath)వి చేతకాని మాటలు అని, తెలంగాణతో ఏపీని పోల్చుతూ చేసిన వ్యాఖ్యలే నిదర్శనమని బండారు అన్నారు. ఏపీలో కోడి గుడ్డు పెట్టిందని.. అది పెట్ట కావడానికి టైమ్ పడుతుందన్న ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో బండారు మండిపడ్డారు. పరిశ్రమలు తేలేక కోడిగుడ్డు అంటూ కథలు చెబుతున్నారని బండారు విమర్శించారు.

అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జరిగిన ఫార్ములా ఈ-రేస్కు ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ హాజరయ్యారు. ఈ-రేస్ తొలిసారి తెలుగు నేలపై జరుగుతున్నందుకు సంతోషంగా ఉందని, తెలంగాణ సర్కార్ను అభినందిస్తున్నామని ఏపీ మంత్రి అమర్నాధ్ తెలిపారు. ఏపీలో కోడి గుడ్డు పెట్టిందని.. అది పెట్ట కావడానికి టైమ్ పడుతుందని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ వేదికగా హైదరాబాద్ నిలవడం గర్వకారణమని, హైదరాబాద్ ఈ స్థాయికి ఎదగడంలో ఏపీ ప్రజల పాత్ర ఉందని అమర్నాధ్ పేర్కొన్నారు. తెలుగు ప్రజలు కలిసి నిర్మించిన నగరం హైదరాబాద్‌ అని అమర్నాధ్ అన్నారు.

Updated Date - 2023-02-11T19:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising