ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Padayatra: లోకేష్‌ పాదయాత్రపై కొనసాగుతున్న సస్పెన్స్‌

ABN, First Publish Date - 2023-01-23T16:25:12+05:30

టీడీపీ నేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. లోకేష్‌ పాదయాత్రపై ఎస్పీ రిషాంత్‌రెడ్డి (SP Rishanth Reddy) స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: టీడీపీ నేత నారా లోకేష్‌ యువగళం పాదయాత్రపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. లోకేష్‌ పాదయాత్రపై ఎస్పీ రిషాంత్‌రెడ్డి (SP Rishanth Reddy) స్పందించారు. అన్నీ పరిశీలించి నిబంధనల మేరకు అనుమతి ఇస్తామని ప్రకటించారు. రెండు రోజుల్లోపు అనుమతి ఇస్తామని, నిబంధనలకు లోబడే పాదయాత్ర నిర్వహించుకోవాలని తెలిపారు. నారా లోకేష్‌ (Nara Lokesh) పాదయాత్ర (Padayatra) ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఒకరోజు ముందుగానే కుప్పం (Kuppam) వెళ్లనున్నారు. పాదయాత్ర 400 రోజుల్లో 4 వేల కిలోమీటర్లు నడవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ‘యువగళం’ (Yuvagalam) పేరుతో కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. 25వ తేదీ ఉదయం హైదరాబాద్‌, ఎన్‌టీఆర్‌ ఘాట్‌ (NTR Ghat)లో లోకేష్ కుటుంబ సభ్యులతో కలిసి నివాళ్లు అర్పించనున్నారు. అదే రోజు రాత్రి తిరుమల (Tirumala)కు చేరుకొని కుటుంబ సభ్యులతో కలిసి 26వ తేదీ ఉదయం శ్రీవారి దర్శించుకుంటారు. 27వ తేదీన కుప్పంలోని వరదరాజుస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.

Updated Date - 2023-01-23T16:25:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising