Road Accident: మచిలీపట్నం వద్ద రోడ్డు ప్రమాదం..
ABN, First Publish Date - 2023-11-14T22:43:37+05:30
మచిలీపట్నం సుల్తానగరం సమీపంలోని సుమ కన్వెన్షన్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది.
కృష్ణా జిల్లా: మచిలీపట్నం సుల్తానగరం సమీపంలోని సుమ కన్వెన్షన్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయలయ్యాయి. జాతీయ రహదారిపై ఆగి ఉన్న కర్రల లోడ్ ట్రాక్టర్‌ను ఢీకొని ఇరువురు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన మచిలీపట్నంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గాయపడిన వారు గూడూరు గ్రామానికి చెందిన బత్తిన రవికుమార్, గొరిపర్తి మణికంఠగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2023-11-14T22:43:54+05:30 IST