Lokesh: అది జగనాసుర రక్తచరిత్ర అని చెల్లి షర్మిల తేల్చారు
ABN, First Publish Date - 2023-07-21T17:06:37+05:30
అమరావతి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. అది జగనాసుర రక్తచరిత్ర అని చెల్లి షర్మిల తేల్చారంటూ వైఎస్ షర్మిల వాంగ్మూలంపై లోకేష్ ట్వీట్ చేశారు.
అమరావతి: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ట్వీట్ (Tweet) చేశారు. అది జగనాసుర రక్తచరిత్ర అని చెల్లి షర్మిల (Sharmila) తేల్చారంటూ వైఎస్ షర్మిల వాంగ్మూలంపై లోకేష్ ట్వీట్ చేశారు. రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందని, హత్యకు పెద్ద కారణం ఉందని షర్మిల పేర్కొన్న విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. కడప ఎంపీగా పోటీ చేయమని బాబాయ్ వివేక అడిగారని, అవినాష్ (Avinash) కుటుంబానికి వ్యతిరేకంగా వివేక నిలబడటమే హత్యకు కారణమని షర్మిల చెప్పారన్నారు. కుటుంబంలో అంతా బాగున్నట్టు కనిపించినా లోపల కోల్డ్ వార్ (Cold War) ఉండేదని షర్మిల చెప్పిన అంశాన్ని కోట్ చేశారు. చివరకు ఇది జగనాసుర రక్తచరిత్ర అని తేలిందని... అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ అని లోకేష్ ట్వీట్ చేశారు.
కాగా టీడీపీ యువనేత నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా, కనిగిరి నియోజక వర్గంలో పూర్తయింది, మార్కాపురం నియోజక వర్గంలోకి ప్రవేశించిందని, పెద్దారికట్లలో యువనేత లోకేష్‌కు టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అపూర్వస్వాగతం పలికారు. మార్కాపురం ఇన్‌చార్జ్ కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. భారీ గజమాలలతో సత్కరించారు. మహిళలు హారతులు పట్టి.. దిష్టితీస్తూ అభిమానాన్ని చాటుకున్నారు. యువనేతతో ఫోటోలు దిగేందుకు మహిళలు, యువకులు పోటీపపడ్డారు.
Updated Date - 2023-07-21T17:06:37+05:30 IST