ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Achchennaidu: జగన్‌ డైరెక్షన్‌లోనే టీడీపీ ఎమ్మెల్యేలపై భౌతిక దాడులు: అచ్చెన్న

ABN, First Publish Date - 2023-03-21T20:09:29+05:30

సీఎం జగన్మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) డైరెక్షన్‌లోనే అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై భౌతిక దాడులు జరుగుతున్నాయని టీడీపీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శ్రీకాకుళం: సీఎం జగన్మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) డైరెక్షన్‌లోనే అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలపై భౌతిక దాడులు జరుగుతున్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Achchennaidu) ఆరోపించారు. ‘‘ముఖ్యమంత్రి జగన్‌ తన సైకో చేష్టలతో పైశాచిక ఆనందం పొందేందుకు అసెంబ్లీలో దాడులు చేయిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయంతో వైసీపీలో వణుకు ఆరంభమైంది. వైసీపీ (YCP) సీన్‌ కాలిపోయినట్లే. ఈవిషయం జగన్‌కు కూడా అర్థమైపోయింది. అందుకే టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ వింతగా ప్రవర్తిస్తున్నారు. గాలికి పుట్టిన పార్టీ వైసీపీ. వచ్చే ఎన్నికల గాలికి వైసీపీ పోతుంది. ప్రజలే బంగాళాఖాతంలో కలిపేస్తున్నారు. జగన్‌ రూ.లక్షల కోట్ల అప్పు తెచ్చి.. అన్ని వర్గాల ప్రజలపైనా భారం మోపేశారు. అందుకే రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అని అచ్చెన్న తెలిపారు.

అసెంబ్లీలో అరాచకం!

శాసనసభలో సోమవారం అరాచకం రాజ్యమేలింది. విపక్ష సభ్యులపై పాలక పక్ష సభ్యులు భౌతిక దాడికి పాల్పడ్డారు. నిండు సభలో.. సభాపతి సాక్షిగా.. విపక్ష దళిత ఎమ్మెల్యేను దారుణంగా కొట్టారు. టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీబాలవీరాంజనేయస్వామిపై వైసీపీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు దాడిచేశారు. చరిత్రలో ఎప్పుడూ జరగని ఈ ఘటనతో సభ మొత్తం నిర్ఘాంతపోయింది. ఏం జరుగుతుందోనని సభ్యులంతా తేరుకునేలోపే భౌతిక దాడి జరిగిపోయింది. ఊహించని పరిణామంతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం సభను వాయిదా కూడా వేయకుండానే తన చాంబర్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం, దాడుల ప్రయత్నాలతో సభ యుద్ధభూమిని తలపించింది. మాజీ మంత్రి, వైసీపీకి చెందిన వెలంపల్లి శ్రీనివాస్‌.. టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని కొట్టేందుకు ప్రయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీయగా.. ఎమ్మెల్యే డోలాను మరోమారు కొట్టేందుకు సూళ్లూరుపేట వైసీపీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య దూసుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది.

Updated Date - 2023-03-21T20:09:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising