ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

#Happy Birthday Mahesh Babu: రూటు మార్చిన పవన్.. మహేష్ బాబుకు స్పెషల్ విషెస్

ABN, First Publish Date - 2023-08-09T12:23:00+05:30

పవన్‌కల్యాణ్ తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇతర హీరోలతో అంటీముట్టనట్లుగా ఉండేవారని ఆరోపణలు ఉండేవి. తన పనేదో తాను చేసుకుని వెళ్లిపోతారని గుసగుసలు ఉండేవి. కానీ ఈ మధ్య జనసేనాని తన రూట్ మార్చారని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

అమరావతి: టాలీవుడ్ సూపర్ స్టార్, ప్రిన్స్ మహేష్‌బాబుకి (Happy Birthday Mahesh Babu) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు (Pawan Kalyan). ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. ‘‘తెలుగు చలన చిత్రసీమలో తనదైన పంథా కలిగిన అగ్రశ్రేణి కథానాయకుడు మహేష్. కథానాయకుడిగా అందుకున్న ఘన విజయాలు తెలుగు సినీ పరిశ్రమ వృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. తండ్రి నటశేఖర కృష్ణ గారి అడుగుజాడల్లో వెళ్తూ.. విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్థ్యం ఆయన సొంతం. సోదర సమానుడైన మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

పవన్‌కల్యాణ్ తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఇతర హీరోలతో అంటీముట్టనట్లుగా ఉండేవారని ఆరోపణలు ఉండేవి. తన పనేదో తాను చేసుకుని వెళ్లిపోతారని గుసగుసలు ఉండేవి. కానీ ఈ మధ్య జనసేనాని తన రూట్ మార్చారని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల వారాహి యాత్రలో భాగంగా గోదావరి జిల్లాల పర్యటనలో పవన్‌కల్యాణ్ పదే పదే సాటి హీరోల గురించి ప్రస్తావించడం జరిగింది. మహేష్, జూ.ఎన్టీఆర్. ప్రభాష్.. ఇలా తెలుగు హీరోలందరూ తన కంటే గొప్పవారని.. వారంతా పాన్ ఇండియా హీరోలంటూ ఆకాశానికెత్తారు. ఇందులో భాగంగానే మహేష్‌బాబు బర్త్‌డే పురస్కరించుకుని స్పెషల్‌గా జనసేనాని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలుస్తోంది. దీని వెనుక ఉన్న మతలబేంటో.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి ఎలాంటి మైలేజ్ ఇస్తుందో వేచి చూడాలి.

Updated Date - 2023-08-09T12:23:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising