ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు అడుగడుగునా అడ్డంకులు.. అరెస్ట్ తప్పదా..?

ABN, First Publish Date - 2023-09-09T23:11:46+05:30

అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును (Chandrababu Naidu) పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్ కార్యాలయానికి వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు.

అమరావతి: అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును (Chandrababu Naidu) పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా తాడేపల్లి సిట్ కార్యాలయానికి వస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను (Pawan Kalyan) పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారు.


మధ్యాహ్నం ప్రత్యేక విమానం టేకాఫ్ అవకుండా అధికారులు అడ్డుపడ్డారు. దీంతో రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఎన్టీఆర్ జిల్లా సరిహద్దు గరికపాడు వద్ద పవన్ కళ్యాణ్ వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, అభిమానులకు మధ్య వాగ్వివాదం జరిగింది. అభిమానుల ఆందోళనతో పవన్ కళ్యాణ్ వాహనాన్ని పోలీసులు ముందుకు వదిలారు. పవన్‌ కళ్యాణ్‌‌తో పాటు, మనోహర్‌ను కూడా చంద్రబాబును పరామర్శించేందుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. పోలీసుల తీరు పట్ల జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌ను జగ్గయ్యపేట దాటిన తర్వాత అనుమంచిపల్లి వద్ద మళ్లీ అడ్డుకున్నారు. అడ్డంగా పెట్టిన బారీకెడ్లును నెట్టివేసి కాన్వాయ్‌ను ముందుకు తీసుకువెళ్లేందుకు జనసేనా కార్యకర్తలు ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నడిచి మంగళగిరి చేరుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. అనుమంచిపల్లిలో అడ్డుకోవడంతో పవన్ కల్యాణ్ వాహనం దిగి నడక మొదలు పెట్టారు. పవన్‌ను పోలీసులు అడ్డుకోవడంతో జనసేన కార్యకర్తలు రోడ్డుపై పడుకుని నిరసన తెలియజేస్తున్నారు. అనుమంచిపల్లి వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. జాతీయ రహదారికి అడ్డంగా పవన్ కళ్యాణ్ పడుకున్నారు. ప్రత్యేక పోలీసు బలగాలని రప్పించేందుకు స్థానిక పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-09-09T23:22:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising