ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Karumuri Nageshwarrao: మిచౌంగ్ తుఫాన్‌కు రైతులు అధైర్యపడద్దు

ABN, First Publish Date - 2023-12-05T16:13:25+05:30

Andhrapradesh: మిచాంగ్ తుఫాన్‌కు రైతులు ఎవ్వరు అధైర్యపడద్దని రాష్ట్ర పౌరసరాఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం తణుకు నియోజకవర్గంలోని దువ్వ, వరిగేడు గ్రామాల్లో మంత్రి పర్యటించి రైతులతో మాట్లాడారు.

పశ్చిమగోదావరి: మిచాంగ్ తుఫాన్‌కు (Cyclone Michaung) రైతులు ఎవ్వరు అధైర్యపడద్దని రాష్ట్ర పౌరసరాఫరాల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు (Minister Karumuri Venkata Nageshwarrao)అన్నారు. మంగళవారం తణుకు నియోజకవర్గంలోని దువ్వ, వరిగేడు గ్రామాల్లో మంత్రి పర్యటించి రైతులతో మాట్లాడారు. అనంతరం కారుమూరి మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి పరిస్థితిలో ఉన్న ధాన్యాన్ని అయినా ప్రభుత్వమే కొంటుందని స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా రైతులు తమ ధాన్యాన్ని అందుబాటులో ఉన్న మిల్లులకు తరలించుకోవాలన్నారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రెండు విధాలుగానూ ధాన్యాన్ని తరలించే వెసులుబాటు కల్పించామన్నారు. ఏ మిల్లరైనా రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-12-05T16:13:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising