ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yuvagalam Padayatra: రైతాంగాన్ని జగన్‌ గాలికొదిలేశారు: నారా లోకేశ్‌

ABN, First Publish Date - 2023-05-02T13:43:02+05:30

రైతాంగాన్ని సీఎం జగన్‌ (CM Jagan) గాలికొదిలేశారని టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగంపై జగన్‌‌కు కనీస అవగాహన లేదని ఎద్దేవాచేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: రైతాంగాన్ని సీఎం జగన్‌ (CM Jagan) గాలికొదిలేశారని టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగంపై జగన్‌‌కు కనీస అవగాహన లేదని ఎద్దేవాచేశారు. సీఎం అసమర్థత, చేతగానితనం వల్లే.. రాష్ట్ర రైతాంగం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలిపారు. దేశంలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. రూ.3,500 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందో చెప్పాలి? అని లోకేశ్ ప్రశ్నించారు. అధికారంలోకి రాగానే ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామని ప్రకటించారు. అకాల వర్షాలతో రైతులు నష్టపోతే సీఎం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. కనీసం పంట నష్టం అంచనా వేసే దిక్కు కూడా లేదన్నారు. టీడీపీ (TDP) హయాంలో రైతులకు నష్టపరిహారం త్వరగా అందించామని గుర్తుచేశారు. క్రాప్ ఇన్సూరెన్స్ పథకాన్ని జగన్ సర్కార్‌ నిర్వీర్యం చేసిందని దుయ్యబట్టారు. రాయలసీమ (Rayalaseema) పల్లెల్లో గుక్కెడు నీళ్లందక ప్రజల అవస్థలు పడుతున్నారని, జగన్‌రెడ్డి ఒక్క తాగునీటి కుళాయి అయినా వేశారా? అని ప్రశ్నించారు. సీమజనాల తాగునీటి కష్టాలకు ఈ ప్లాస్టిక్ బిందెలే నిదర్శనమన్నారు. రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగన్ ప్రజలను గాలికొదిలేశారని మండిపడ్డారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప జగన్‌ చేసిందేమీ లేదని లోకేశ్ తెలిపారు.మత్స్యకారుల పొట్టగొట్టేలా జగన్ 217 జీవో తీసుకొచ్చారని, అధికారంలోకి రాగానే సబ్సిడీపై వలలు, బోట్లు అందజేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకారులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని లోకేశ్ ప్రకటించారు.

Updated Date - 2023-05-02T13:43:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising