Nara bhuvaneshwari: సెప్టెంబర్ 10న చంద్రబాబు, భువనేశ్వరిల వివాహ వార్షికోత్సవం
ABN, First Publish Date - 2023-09-09T13:08:02+05:30
ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరిల వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్నారు. దీన్ని పురస్కరించుకుని మరికాసేపట్లో విజయవాడ దుర్గమ్మను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దర్శించుకోనున్నారు. ఇదిలా ఉంటే వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని
అమరావతి: ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరిల వివాహ వార్షికోత్సవం జరుపుకోనున్నారు. దీన్ని పురస్కరించుకుని మరికాసేపట్లో విజయవాడ దుర్గమ్మను చంద్రబాబు సతీమణి భువనేశ్వరి దర్శించుకోనున్నారు. ఇదిలా ఉంటే వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రేపు చంద్రబాబుతో కలిసి అమ్మవారిని దర్శించుకోవాలని భువనేశ్వరి (Nara bhuvaneshwari) భావించారు. కానీ శనివారం ఉదయమే చంద్రబాబును సీఐడీ పోలీసులు (Chandrababu arrest) అదుపులోకి తీసుకోవడంతో ఈరోజే అమ్మవారిని దర్శించుకోవాలని భువనేశ్వరి నిర్ణయం తీసుకున్నారు. దర్శనం అనంతరం చంద్రబాబు అరెస్ట్‌పై ఇంద్రకీలాద్రిపై మీడియాతో మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
చంద్రబాబును ప్రస్తుతం సీఐడీ పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. సాయంత్రం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బెయిల్ కోసం టీడీపీ నేతలు పిటిషన్ వేశారు.
Updated Date - 2023-09-09T13:14:12+05:30 IST