ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Birthday Wishes: చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ రఘురామ

ABN, First Publish Date - 2023-04-20T11:47:51+05:30

ఢిల్లీ: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి, ఎన్నో సంస్కరణలకు మార్గదర్శి అయిన చంద్రబాబు నాయుడుకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి, ఎన్నో సంస్కరణలకు మార్గదర్శి అయిన చంద్రబాబు నాయుడుకు (Chandrababu Naidu) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) జన్మదిన శుభాకాంక్షలు (Birthday Greetings) తెలిపారు. ప్రజలు సంతోషంగా ఉండాలనేది చంద్రబాబు ఆకాంక్ష.. కోరిక అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘హ్యాట్సాఫ్ సునీత రెడ్డి.. కంటే కూతురినే కనాలి’ అని అన్నారు. గురువారం ఉదయం సీనియర్ న్యాయవాది సిదర్ధా లుత్రా సుప్రీంకోర్టు (Supreme Court)లో కేసు మెన్షన్ చేశారు. హైకోర్టు (High Court) ఆర్డర్‌ను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. శుక్రవారం ఈ కేసును న్యాయస్థానం విచారించనుంది.

నీచమైన కట్టుకథలు సాక్షిలో రాస్తున్నారని రఘురామ మండిపడ్డారు. హైకోర్టు తీర్పుపై ప్రజలు ఇదేమి తీర్పు అని అనుకున్నారని.. కానీ న్యాయస్థానాన్ని నమ్మాలని తాను విజ్ఞప్తి చేశానన్నారు. సునీత రెడ్డి సుప్రీంకోర్టుకు వస్తారని అవినాష్ రెడ్డి అనుకోలేదన్నారు. సీబీఐ, చంద్రబాబు కుమ్మక్కయ్యారని సజ్జల, వైసీపీ నేతలు అంటున్నారని, చంద్రబాబు అల చేస్తే జగన్ బయట తిరిగే వారా? ఒక్క రోజు కూడా కోర్టుకు వెళ్లకుండా ఉండే వారా? అని అన్నారు. సునీత రెడ్డి మౌనంగా న్యాయపోరాటం చేస్తుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

ముఖ్యమంత్రి జగన్‌ (CM Jagan) బాబాయ్‌ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case)లో ఎంపీ అవినాశ్‌ రెడ్డి (Avinash Reddy)ని ఈనెల 25వ తేదీ వరకు అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పటిదాకా ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ స్పష్టం చేసింది. కాగా.. అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్‌కు వ్యతిరేకంగా వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది. ఈ రోజు సీజేఐ ధర్మాసనం ముందు సునీత పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు.

Updated Date - 2023-04-20T11:47:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising