ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kodalinani: చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని.. విమర్శలపై క్లారిటీ

ABN, First Publish Date - 2023-08-22T12:22:50+05:30

మెగాస్టార్ చిరంజీవిపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని గతంలో చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఏకంగా పకోడిగాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. ఇంత రచ్చ చేసిన కొడాలి నాని తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఆశ్చర్యానికి గురిచేసింది.

కృష్ణా: మెగాస్టార్ చిరంజీవిపై (Megastar Chiranjeevi) మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని (YCP MLA Kodali Nani)గతంలో చేసిన వ్యాఖ్యలు ఎంతటి సంచలనాన్ని రేపాయో అందరికీ తెలిసిందే. ఏకంగా పకోడిగాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. ఇంత రచ్చ చేసిన కొడాలి నాని తాజాగా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేకాకుండా చిరంజీవిపై ఎలాంటి విమర్శలు చేయలేదని.. నేను ఏమి మాట్లాడినా బూతులా వినిపిస్తున్నాయని కొడాలి నాని చెప్పుకు రావడం హాట్ టాపిక్‌గా మారింది.


మంగళవారం మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొడాలినాని పాల్గొన్నారు. కేక్ కట్ చేసి చిరంజీవి అభిమానులకు పంచారు. ఆపై నాని మాట్లాడుతూ.. చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు. చిరంజీవిని తాను విమర్శించినట్లు నిరూపించాలంటూ ఛాలెంజ్ విసిరారు. ‘‘నేను శ్రీరామ అన్నా టీడీపీ, జనసేనలకు బూతు మాటలుగా వినపడతాయి. నేనేం మాట్లాడానో చిరంజీవికి, ఆయన అభిమానులకు తెలుసు..... మేమంతా క్లారిటీ గానే ఉన్నాం’’ అని స్పష్టం చేశారు. రాజకీయంగా చిరంజీవి విమర్శిస్తే ఏం జరుగుతుందో తనకు తెలుసన్నారు. జగన్ గురించి, తమ గురించి మాట్లాడితే ఎంతటి వారినైనా చీల్చి చెండాడతానని.. ఎవరి జోలికి వెళ్ళని పెద్దాయన చిరంజీవిని విమర్శించే సంస్కారహీనుడును కాదని తెలిపారు. చిరంజీవి అభిమానుల ముసుగులో, టీడీపీ, జనసేన శ్రేణులు గుడివాడ రోడ్లు మీద దొల్లారని మండిపడ్డారు. చిరంజీవికి, తమకు మధ్య అగాధం సృష్టించాలని టీడీపీ, జనసేన కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ప్రజారాజ్యం తరపున తన కార్యాలయం మీదుగా ర్యాలీగా వెళ్లిన చిరంజీవికి చేతులెత్తి నమస్కారం పెట్టానని తెలిపారు. ఆయనను అనేక సందర్భాల్లో కలిశానని.. పెద్దాయనగా చిరంజీవి చెప్పే సూచనలు పాటిస్తామని అన్నారు. తమకు ఇచ్చినట్లే.... డ్యాన్సులు, నటన చేతకాని ఇండస్ట్రీలోని పకోడీ గాళ్ళకు చిరంజీవి సలహాలు ఇవ్వాలనే చెప్పినట్లు వివరించారు. ఇండస్ట్రీలో శిఖరాగ్రాన ఉన్న చిరంజీవికి డాన్సులు, యాక్షన్ రాదా.... ఆయన గురించి మాట్లాడినట్లు ఎట్లా అవుతుందని’’ ప్రశ్నించారు. తన వెంట ఉన్న వ్యక్తులు 60 శాతం చిరంజీవి అభిమానులే అని కొడాలి నాని వెల్లడించారు.

Updated Date - 2023-08-22T12:30:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising