Chandrababu: చంద్రబాబు నివాసంలో నేటీతో ముగియనున్న హోమం
ABN, Publish Date - Dec 24 , 2023 | 10:11 AM
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాసంలో జరుగుతున్న హోమం ఆదివారంతో ముగియనుంది. మూడు రోజులుగా మహాచండీయాగం, సుదర్శన నారసింహ హోమాలు నిర్వహిస్తున్నారు.
అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాసం ( Chandrababu house )లో జరుగుతున్న హోమం ఆదివారంతో ముగియనుంది. మూడు రోజులుగా మహాచండీయాగం, సుదర్శన నారసింహ హోమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు జరగనున్న పూర్ణహుతిలో చంద్రబాబు దంపతులు పాల్గొననున్నారు. మధ్యాహ్నంతో యాగం, హోమం ముగియనుంది. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలను చంద్రబాబు దంపతులు ఆహ్వానించారు.
నారా చంద్రబాబునాయుడు నివాసంలో శుక్రవారం నుంచి శతచండీ, పారాయణ, మహాచండీ యాగం, సుదర్శన నారసింహ హోమాలు నిర్వహిస్తున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఈ హోమం జరుగుతోంది. మూడు రోజుల పాటు జరుగుతున్న ఈ క్రతువుల్లో చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు పాల్గొంటున్నారు. అలాగే ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దేవినేని ఉమా, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్, కొల్లు రవీంద్ర, బోండా ఉమ, నారాయణ, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు కూడా పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2023 | 10:11 AM