ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kollu Ravindra: మహనీయుడు ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు...

ABN, First Publish Date - 2023-04-13T13:24:47+05:30

కృష్ణా జిల్లా: నందమూరి తారకరామారావు స్వగ్రామం నిమ్మకూరులో నారా చంద్రబాబు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కృష్ణా జిల్లా: నందమూరి తారకరామారావు (NTR) స్వగ్రామం నిమ్మకూరులో నారా చంద్రబాబు (Nara Chandrababu) ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం ఆనందంగా ఉందని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంధ్ర (Kollu Ravindra) అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మహనీయుడు ఎన్టీఆర్ పుట్టిన గడ్డ.. నిమ్మకూరని.. కృషి ఉంటే మనుషులు రుషులవుతారన్న సూత్రానికి అన్న ఎన్టీఆర్‌ నిదర్శనమన్నారు. రాముడు, కృష్ణుడు, నాయకుడు ఎలా ఉండాలో‌ ఎన్టీఆర్‌ చూపించారన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం ఢిల్లీ గడ్డనే గడగడలాడించారని, స్థానిక సంస్థలలో మొట్టమొదటిగా బీసీ, దళితుల కోసం రిజర్వేషన్‌లు కల్పించారని కొనియాడారు. హరికృష్ణ (Harikrishna), ‌బాలకృష్ణ (Balakrishna) తరచూ ఈ గ్రామానికి వస్తుండే వారని... ఇప్పుడు చంద్రబాబు రాకతో‌ పల్లెలో‌ పండుగ వాతావరణం నెలకొందన్నారు. దుష్ట పాలనకు‌ చరమ‌గీతం పాడి సాగనంపాలని పిలుపిచ్చారు. మళ్లీ చంద్రబాబును సీఎం‌గా చేసుకుని మన నిమ్మకూరు తీసుకొద్దామని కొల్లు రవీంధ్ర టీడీపీ నేతలు, కార్యకర్తలకు పిలుపిచ్చారు.

దేవినేని ఉమ (Devineni Uma) మాట్లాడుతూ... నిమ్మకూరు గ్రామానికి నందమూరి అల్లుడు చంద్రబాబు వచ్చారన్నారు. ఎన్టీఆర్‌ ఈ‌నేల‌పై పుట్టి విశ్వ వ్యాప్తంగా కీర్తి గడించారన్నారు. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు, మోసాలతో రాక్షస పాలన చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు హైదరాబాద్‌ అభివృద్ధి ప్రపంచ పటంలో నిలిపిందన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను ఈ ప్రాంతానికి అందించారని, అందరూ ఆలోచన చేయాలని సూచించారు. అరాచక పాలన కావాలా?... అభివృద్ధి పాలన కావాలా? అని అన్నారు. లోకేష్ పాదయాత్రకు ప్రజలు నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. వచ్చే ఎన్నికలలో ఈ దుష్ట పాలనకు బుద్ది చెప్పి... చంద్రబాబు ప్రజా పాలనకు స్వాగతం పలుకుదామని దేవినేని ఉమ పిలుపిచ్చారు.

Updated Date - 2023-04-13T13:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising