Home » Devineni Umamaheswara Rao
సామాజిక భద్రత అంశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా నిలుస్తోందని మాజీ మంత్రి దేవినేని ఉమా సంతోషం వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, జల భద్రత వంటి అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తోందని ప్రశంసించారు.
ఐదేళ్ల అరాచకాల పాలన మరిచిపోయి నేడు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఏకగ్రీవాల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. జగన్ రాజకీయ భవిష్యత్తుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలే సమాధానం చెబుతారని చెప్పారు.
మాజీ సీఎం నందమూరి తారక రామారావు 103వ జయంతిని గొల్లపూడిలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని నివాళులు అర్పించారు. ఎన్టీఆర్‌కు పూలమాలవేసి ఆయన సేవలను కొనియాడారు.
మెగా డీఎస్సీపై వైసీపీ చేస్తున్న విమర్శలను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. మంత్రి నారా లోకేష్‌కు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక ఫేక్ ప్రచారం చేస్తున్నారని అన్నారు.
అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేయటం చారీత్రాత్మక నిర్ణయమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. కూటమి ప్రభుత్వం ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్షను నేరవేర్చిందని పేర్కొన్నారు.
కూటమి సర్కార్ పాలనలో రాష్ట్రం చీకటి పాలన నుంచి పారదర్శక పాలన దిశగా ముందుకు సాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాడు అన్ని రంగాల్లోనూ వెనుకబడిన రాష్ట్రాన్ని.. సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి గాడిలో పెట్టారని చెప్పారు.
మాజీ సీఎం జగన్‌పై దేవినేని ఉమా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పులివెందుల మెడికల్ కాలేజీకి రూ.481 కోట్లు ఖర్చు చేసిన జగన్.. పాడేరు, పార్వతిపురం కాలేజీలకు ఎందుకు ఖర్చు చేయలేదని ప్రశ్నించారు.
చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఇవాళ(శుక్రవారం) దేవినేని ఉమా కలిశారు.
జగన్‌పై మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్ కోర్టుకు హాజరయ్యారని చెప్పే దమ్ము, ధైర్యం బ్లూ మీడియాకు లేదంటూ మండిపడ్డారు. జగన్ ఆర్థిక ఉగ్రవాది అంటూ వ్యాఖ్యలు చేశారు.
జగన్ దొంగలకు పెద్దన్నలా నిలిచారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకన్న స్వామితో పెట్టుకున్నారు కాబట్టే చిత్తుగా ఓడి 11 సీట్లకు పడిపోయారని వ్యాఖ్యలు చేశారు.