Devineni Uma Fires on YS Jagan: విధ్వంసకర రాజకీయాలు మానేయ్.. జగన్‌కు దేవినేని స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Sep 21 , 2025 | 07:00 PM
ఐదేళ్లు ఇరిగేషన్ రంగాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని దేవినేని విమర్శించారు.
విజయవాడ, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు (Devineni Uma Maheshwara Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ 11 సీట్లకు పరిమితమైనా జగన్ మైండ్ సెట్, ఆ పార్టీ ఆలోచనా విధానంలో ఏమాత్రం మార్పు లేదని విమర్శించారు. ఐదేళ్లలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టు పనులను మూడు శాతమే చేసి ఇంకా సిగ్గు లేకుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) విజయవాడలో దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.
పోలవరం ఫేజ్-1, ఫేజ్-2 లేవని చెప్పారని.. కానీ మీడియా సమావేశంలో ఫేజ్‌ల వారీగా విడదీశామని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాస్తవాలు ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. బుగ్గనకు సిగ్గుంటే తన జిల్లాలోని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం సందర్శించాలని.. అది ఎక్కడుందో కూడా ఆయనకు తెలీదని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టును రెండు ఫేజ్‌లుగా విడదీశామని జగన్ ప్రజల ముందుకొచ్చి చెంపలేసుకోవాలని హితవు పలికారు. పదవి పోయిందని ఏడుస్తావా?.. బుద్ధి జ్ఞానం ఉందా? అంటూ దేవినేని ఉమా ఫైర్ అయ్యారు.
'దేనికయ్యా జగన్ నీకు అధికారం ఏపీని నాశనం చేయడానికా..?' అని ప్రశ్నించారు. 'అంబటి రాంబాబు.. ఎందుకు నోరు పారేసుకుంటావ్' అని హెచ్చరించారు. ఐదేళ్లు ఇరిగేషన్ రంగాన్ని వైసీపీ సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వంలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిందని విమర్శించారు. విధ్వంసకర రాజకీయాలు మానేసి జగన్ రెడ్డి వైసీపీ దుకాణం సర్దుకుంటే మంచిదని దేవినేని ఉమా మహేశ్వరరావు హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకో.. రఘురామ ప్రశ్నల వర్షం
కరుణాకర్ రెడ్డికి ముందుంది ముసళ్ల పండగ.. భాను ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest AP News And Telugu News