Share News

Raghurama Criticizes Jagan: జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకో.. రఘురామ ప్రశ్నల వర్షం

ABN , Publish Date - Sep 21 , 2025 | 02:24 PM

సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ఎంపీగా, గతంలో ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చేశారని..ఆయనకు రూల్స్ తెలియకుండా కామెంట్స్ చేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Raghurama Criticizes Jagan: జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకో.. రఘురామ ప్రశ్నల వర్షం
Raghurama Criticizes Jagan

పశ్చిమగోదావరి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు (Raghu rama Krishnam Raju) హాట్ కామెంట్స్ చేశారు. గతంలో జగన్ ఎంపీగా, ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా చేశారని.. ఆయనకు రూల్స్ తెలియకుండా కామెంట్స్ చేస్తారా అని ప్రశ్నల వర్షం కురిపించారు. భారత రాజ్యాంగం 190(4) చాలా స్పష్టంగా ఉందని తెలిపారు. ఎవరైనా లీవ్ ఆఫ్ ఆక్షన్స్ అడగకుండా కంటిన్యూస్‌గా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు రాకపోతే శాసనసభ సభ్యత్వానికి, పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులు అవుతారని జగన్‌కు తెలియదా అని నిలదీశారు. అసెంబ్లీ రూల్స్ నెట్‌లో ఉంటాయని జగన్ చూసుకోవాలని హితవు పలికారు రఘురామ కృష్ణరాజు.


వైసీపీ అధ్యక్షులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ రూల్స్‌ను చూసుకుంటే ఎవరూ ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారనేది అర్థం అవుతోందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి ఎంత సమయం ఇవ్వాలనేది ఆయా పార్టీల స్ట్రెంత్‌ను బట్టి సమయం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ప్రతీ రోజూ క్వశ్చన్ అవర్‌లో రెండు ప్రశ్నలు వైసీపీ సభ్యులకు వస్తున్నాయని తెలిపారు. వైసీపీ సభ్యులు ఎవరూ కూడా సభలో ఎందుకు ఉండటం లేదని ప్రశ్నించారు. గత జగన్ ప్రభుత్వంలోని ఐదు సంవత్సరాల్లో ఏపీ అసెంబ్లీ 68, 69 రోజులు మించి ఎందుకు జరగలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నల వర్షం కురిపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

పల్నాడులో రౌడీయిజం చేస్తే చూస్తూ ఊరుకోను: సీఎం చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 మంది ఐఏఎస్‌ల బదిలీ

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 02:29 PM