Share News

Bhanu Prakash Reddy Warning Bhumana: కరుణాకర్ రెడ్డికి ముందుంది ముసళ్ల పండగ‌‌‌‌‌.. భాను ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Sep 21 , 2025 | 02:49 PM

తిరుపతి శ్రీవారి పరకామణిలో జరిగిన దొంగతనం గురించి తాము ఆధారాలతో సహా మాట్లాడుతున్నామని టీటీడీ బోర్డు సభ్యుడు‌‌‌ భాను ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు, భూమన కరుణాకర్ రెడ్డిలకి ముసళ్ల పండగ‌‌‌‌‌ ముందుందని భాను ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.

Bhanu Prakash Reddy Warning Bhumana: కరుణాకర్ రెడ్డికి ముందుంది ముసళ్ల పండగ‌‌‌‌‌..  భాను ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Bhanu Prakash Reddy Warning Bhumana Karunakar Reddy

తిరుపతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): తిరుపతి శ్రీవారి పరకామణిలో జరిగిన దొంగతనం గురించి తాము ఆధారాలతో సహా మాట్లాడుతున్నామని టీటీడీ బోర్డు సభ్యుడు‌‌‌ భాను ప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) స్పష్టం చేశారు. వైసీపీ నేతలకు, భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy)లకి ముసళ్ల పండగ‌‌‌‌‌ ముందుందని హెచ్చరించారు. రవికుమార్ కుటుంబానికి రక్షణ కల్పించాలని సీఎం చంద్రబాబును కోరుతామని అన్నారు. దొంగ దొరికితే వారితో సెటిల్‌మెంట్ చేస్తారా.. ?? అని ఫైర్ అయ్యారు. దొంగలందరూ దొంగతనం చేసి కరుణాకర్ రెడ్డి, జగన్‌ దగ్గరకు పోతే సెటిల్‌మెంట్ చేస్తారని ఆరోపించారు భాను ప్రకాష్ రెడ్డి.


రవికుమార్ దొంగతనం చేస్తుంటే పట్టుకుంది భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు సభ్యుడుగా ఉన్నప్పుడేనని.. ఆ కేసు రాజీ చేసుకుంది కూడా ఆయన టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడేనని గుర్తుచేశారు‌‌‌. ఇప్పుడు తనకేం తెలియదు అన్నట్లుగా భూమన కరుణాకర్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. సెటిల్‌మెంట్ రూ. 40కోట్లకు జరిగిందా.. రూ.400 కోట్లకు జరిగిందా ‌అనేది తేలుస్తామని హెచ్చరించారు భాను ప్రకాష్ రెడ్డి.


రూ. 40కోట్ల శ్రీవారి ఆస్తులు కాపాడితే భూమన కరుణాకర్ రెడ్డి అప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి పరకామణి దొంగతనం విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. దొంగ దొరికితే లోక్ అదాలత్‌లో భూమన కరుణాకర్ రెడ్డి ఎలా కాంప్రమైజ్ చేస్తారని నిలదీశారు.‌‌ మరో రెండు రోజుల్లో శ్రీవారి పరకామణి దొంగతనానికి గురించిన సంచలన విషయాలు బయటకు వస్తాయని చెప్పుకొచ్చారు. స్వామీ వారికంటే మనం గొప్ప వాళ్లమా అని ప్రశ్నించారు. అలాగే స్విమ్స్ మెడికల్ షాపుల్లో అవినీతికి పాల్పడి శ్రీవారి డబ్బులు దోచుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని.. ఎస్ఐ స్థాయి అధికారి విచారణ చేసిన సరిపోతుందని తెలిపారు‌‌. జైలుకెళ్లడానికి భూమన కరుణాకర్ రెడ్డి అండ్ కో ఉత్సాహంగా ఉన్నారని భాను ప్రకాష్ రెడ్డి సెటైర్లు గుప్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి

జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకో.. రఘురామ ప్రశ్నల వర్షం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 9 మంది ఐఏఎస్‌ల బదిలీ

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 03:05 PM