Janasena Kiran Royal: దేవుడి సొమ్ము తిన్న పాపం ఊరికే పోదు..
ABN , Publish Date - Sep 21 , 2025 | 01:58 PM
రవికుమార్ బయటకు వస్తే అసలు బాగోతం బయటకు వస్తుందని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. దొంగతం చేసిన వ్యక్తి పశ్చాత్తాప పడితే వదిలేస్తారా..? అని నిలదీశారు.
తిరుపతి: తిరుమల శ్రీవారి దగ్గర దొంగతనం చేసిన రవి కుమార్ బ్రతికి ఉన్నాడో, లేడో.. అని జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కిరణ్ రాయల్ అనుమానం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి ఆలయంలోని పరకామణిలో దొంగతనం జరిగింది వాస్తవమే అని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ(ఆదివారం) మీడియాతో మాట్లాడారు.. దేవుని డబ్బులు దొంగతనం చేసిన రవికుమార్ దగ్గరే డబ్బులు వసూలు చేసిన వారిని ఏమనాలి..? అని ప్రశ్నించారు. దేవుడి సొమ్ము ఎవరు తిన్న ఆ పాపం ఊరికే పోదని ఆయన పేర్కొన్నారు.
రవికుమార్ బయటకు వస్తే అసలు బాగోతం బయటకు వస్తుందని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. దొంగతం చేసిన వ్యక్తి పశ్చాత్తాప పడితే వదిలేస్తారా..? అని నిలదీశారు. రవికుమార్ రూ. 100 కోట్లు కాదు రూ. 300 కోట్లు దొంగతనం చేశాడని ఆయన ఆరోపించారు. రవికుమార్ దోచేసిన మెుత్తం డబ్బులు భూమన, జగన్, ధర్మారెడ్డిలకు అందాయని కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వ్యక్తికి మీరే శిక్షలు వేస్తే ఇంకా న్యాయస్థానం, చట్టాలు ఎందుకు అని నిలదీశారు. ఈ విషయంలో ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు ముడుపులు ముట్టాయని ఆరోపించారు. త్వరలో అన్ని వాస్తవాలు బయటకి వస్తాయని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్