Ramachandra Rao Fires on Rahul: ఓటు చోరీ.. రాహుల్ గాంధీ తుస్సు బాంబులేశాడు.. రామచందర్ రావు సెటైర్లు
ABN , Publish Date - Sep 20 , 2025 | 04:44 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనపై టీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు సెటైర్లు గుప్పించారు. 50 సార్లు ఢిల్లీ వెళ్లినందుకు రేవంత్‌రెడ్డికి ఆఫ్ సెంచరీ సెలబ్రేట్ చేయాలని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని రామచందర్ రావు విమర్శించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఓటు చోరీ అంశంపై హైడ్రోజన్ బాంబు వేస్తామంటే తాము భయపడ్డామని.. కానీ పేలని తుస్సు బాంబ్‌లేశారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandra Rao) ఎద్దేవా చేశారు. ఓటుచోరీ అంటూ రాహుల్ గాంధీ అసత్యాలు ప్రసారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. భారత రాజ్యాంగం చాలా గొప్పదని ఉద్ఘాటించారు. రాజ్యాంగమే మనల్ని కాపాడుతోందని నొక్కిచెప్పారు. ఓటు చోరీ అంటూ ప్రజలను రాహుల్ గాంధీ భయపెడుతున్నారని మండిపడ్డారు రామచందర్ రావు. ఇవాళ(శనివారం) హైదరాబాద్‌లో మీడియాతో రామచందర్ రావు చిట్‌చాట్ చేశారు.
ఎలక్షన్ కమిషన్‌ను కలిశాం..
బోగస్ ఓట్ల (Bogus Votes)ను కూడా రాహుల్ గాంధీ ఓటు చోరీ అని అంటున్నారని ఫైర్ అయ్యారు. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంలో యాడ్ చేస్తే ఓటు చోరీ అని అంటారని చెప్పుకొచ్చారు. తాము కూడా తెలంగాణలో ఓటు చోరీపై చాలా సార్లు ఎలక్షన్ కమిషన్‌ను కలిశామని గుర్తుచేశారు. ఇలాంటి చిన్న విషయం కూడా తెలుసుకోకుండా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. బోగస్ ఓట్లు వేరు, ఓటు చోరీ వేరని స్పష్టం చేశారు. ఎలక్షన్ ఓటరు లిస్ట్‌లో డిలీట్ చేయాల్సినవి చాలా ఉన్నాయని గుర్తుచేశారు. డిలీట్ చేయమని దరఖాస్తు చేస్తే.. విచారణ చేసి డిలీట్ చేస్తారని తెలిపారు రామచందర్ రావు.
రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనపై సెటైర్లు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ పర్యటనపై టీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు సెటైర్లు గుప్పించారు. 50 సార్లు ఢిల్లీ వెళ్లినందుకు రేవంత్‌రెడ్డికి ఆఫ్ సెంచరీ సెలబ్రేట్ చేయాలని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుందని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సవాల్ విసిరారు. గ్రూప్ వన్ విషయంలో అభ్యర్థులు అందరికీ నష్టం జరుగుతోందని చెప్పుకొచ్చారు రామచందర్ రావు.
జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ప్రభుత్వం...
తెలంగాణలో 13 ఏళ్ల నుంచి గ్రూప్ వన్ పోస్టులు భర్తీ చేయకపోవడంతో అధికారుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోందని తెలిపారు. జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. ఉస్మానియాకి వెళ్లిన రేవంత్‌రెడ్డి రూ.1000 కోట్లు ఇస్తానని చెప్పారని గుర్తుచేశారు. మెస్ బిల్లులు, హాస్టల్స్ మెయింటనెన్స్ లేక విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్‌రెడ్డి అమలు చేయాలని.. కానీ ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయొద్దని హితవు పలికారు. పాకిస్థాన్, భారతదేశం మధ్య జరిగిన యుద్ధంలో ఎన్ని విమానాలు కూలిపోయాయో చెప్పామంటే ఎలా సాధ్యమని రామచందర్ రావు ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సూపర్ మార్కెట్‌కు వెళ్తున్నారా... జాగ్రత్త సుమీ
మహిళలను బీఆర్‌ఎస్ ఇన్సల్ట్ చేస్తోంది.. మంత్రి సీతక్క ఫైర్
Read Latest Telangana News And Telugu News