Share News

Food Safety Raids: సూపర్ మార్కెట్‌కు వెళ్తున్నారా... జాగ్రత్త సుమీ

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:17 PM

నగరవ్యాప్తంగా మొత్తం 44 సూపర్ మార్కెట్లలో అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 58 శాంపిల్స్ సేకరించి టెస్ట్‌ల కోసం ల్యాబ్‌కు పంపించారు. పలు సూపర్ మార్కెట్‌లో వెజ్, నాన్ వెజ్ ప్రొడక్ట్స్ ఒకే చోట స్టోర్ చేసినట్లు గుర్తించారు.

Food Safety Raids: సూపర్ మార్కెట్‌కు వెళ్తున్నారా... జాగ్రత్త సుమీ
Food Safety Raids

హైదరాబాద్, సెప్టెంబర్ 20: నగర వ్యాప్తంగా సూపర్ మార్కెట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food Safety Raids) ఈరోజు (శనివారం) తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్ మార్కెట్లో విస్తుపోయే నిజాలు బయపట్టడాయి. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండా సూపర్ మార్కెట్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గడువు ముగిసినా కూడా ఆయా పదార్థాలను అమ్ముతున్నట్లు దాడుల్లో బయపడింది. నగరవ్యాప్తంగా మొత్తం 44 సూపర్ మార్కెట్లలో అధికారులు తనిఖీలు చేశారు. దాదాపు 58 శాంపిల్స్ సేకరించి టెస్ట్‌ల కోసం ల్యాబ్‌కు పంపించారు. పలు సూపర్ మార్కెట్‌లో వెజ్, నాన్ వెజ్ ప్రొడక్ట్స్ ఒకే చోట స్టోర్ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఫుడ్ స్టోర్స్‌లో ఈగలు, దోమలు ఉన్నట్లు బయలపడింది.


ఈ క్రమంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించని పలు సూపర్ మార్కెట్లకు అధికారులు నోటీసులు జారీ చేశారు. సైదాబాద్ మోర్ రిటైల్‌లో సింథటిక్ కలర్స్‌తో ఫ్రూట్స్ అమ్ముతున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే కాచిగూడ రిలయన్స్ రిటైల్‌లో గడువు ముగిసిన విదేశీ అవకాడో, ఆరెంజెస్ అమ్ముతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు. అటు కొండాపూర్ విజేత సూపర్ మార్కెట్‌లో కూడా గడువు ముగిసిన పాలక్ రైస్ పాపడ్, థిక్ షేక్‌లు అమ్ముతున్నట్లు బయటపడింది. కొండాపూర్ రత్నదీప్ సూపర్ మార్కెట్, కేపీఎన్ ఫార్మ్ ఫ్రెష్‌లో గడువు ముగిసిన పన్నీర్, నిత్యవసర సరుకులు అమ్ముతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. సూపర్ మార్కెట్ల‌లో వస్తువులు కొనే ముందు వాటి ఎక్స్‌పైరీ డేట్ చూసి మరీ కొనాలని ప్రజలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచనలు చేశారు.


ఇవి కూడా చదవండి

నాలుగవ రోజుకు సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 20 , 2025 | 01:42 PM