Share News

Kavitha Comments on Harish Rao: హరీష్ రావుపై అందుకే కోపం.. కవిత షాకింగ్ కామెంట్స్..

ABN , Publish Date - Sep 20 , 2025 | 12:08 PM

కల్వకుంట్ల కవిత మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు టార్గెట్‌గా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే భారీ అవినీతి జరిగిందని ఆరోపించారామె. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె..

Kavitha Comments on Harish Rao: హరీష్ రావుపై అందుకే కోపం.. కవిత షాకింగ్ కామెంట్స్..
Kalvakuntla Kavitha

హైదరాబాద్, సెప్టెంబర్ 20: కల్వకుంట్ల కవిత మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. హరీష్ రావు టార్గెట్‌గా మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే భారీ అవినీతి జరిగిందని ఆరోపించారామె. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆమె.. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్‌ను అలర్ట్ చేశానని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్‌ దేనని హరీష్ రావు.. పీసీ ఘోష్ కమిషన్‌కు చెప్పారని కవిత తెలిపారు. హరీష్ రావుపై కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తప్ప మరే విషయంలోనూ తనకు కోపం లేదన్నారు కవిత.


ఇక పార్టీ బహిష్కరణ, కొత్త పార్టీ స్థాపన వంటి అంశాలపైనా కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ పెట్టాలా? లేదా? అనే దానిపై తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారని గుర్తు చేసిన కవిత.. ప్రస్తుతం తాను కూడా అదే చేస్తున్నానని అన్నారు. తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయిన మొదటి కూతుర్ని తానేనని కవిత వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన తనకు అస్సలు లేదన్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎవరూ తనకు ఫోన్ చేయలేదని చెప్పారు. తాను కాంగ్రెస్ పార్టీలో ఎవరినీ అప్రోచ్ కాలేదన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి పదే పదే తన పేరును ఎందుకు తీసుకొంటున్నారో తెలియదన్నారు. ముఖ్యమంత్రి రేవంతే కాంగ్రెస్ నుంచి బయటకు పోతున్నాడేమో అని సెటైర్లు వేశారు కవిత. ఒక వర్గం కోసం కాదు.. ప్రజలందరి కోసం పని చేయాలనుకుంటున్నట్లు కవిత తెలిపారు. బీసీ ఇష్యూ తన మనస్సుకు దగ్గరగా అనిపించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను ఫ్రీ బర్డ్ అని.. తన ద్వారాలు తెరిచే ఉన్నాయన్నారు. చాలామంది తనను వచ్చి కలుస్తున్నట్లు కవిత తెలిపారు. తనతో టచ్‌లో ఉన్న బీఆర్ఎస్ నేతల లిస్ట్ చాలా పెద్దదే ఉందన్నారు కల్వకుంట్ల కవిత.


Also Read:

Narayana Criticizes Central Govt: రేషన్ తొలగింపు ప్రయత్నం దారుణం.. నారాయణ ఫైర్

Minister TG Bharat: రైతులకు అండగా నిలవాలన్నదే సీఎం చంద్రబాబు ఉద్దేశం..

For More Telangana News and Telugu News..

Updated Date - Sep 20 , 2025 | 12:18 PM