Narayana Criticizes Central Govt: రేషన్ తొలగింపు ప్రయత్నం దారుణం.. నారాయణ ఫైర్
ABN , Publish Date - Sep 20 , 2025 | 11:52 AM
యువత రాజకీయాల్లోకి రావాలని సీపీఐ నారాయణ పిలుపునిచ్చారు. సీపీఐలో 75 ఏళ్ల వయోపరిమితి అమలుపై పార్టీ మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో అవినీతి, నిరుద్యోగం పెరిగి యువత తిరగబడ్డారన్నారు.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: ఛండీగఢ్‌లో రేపటి (ఆదివారం) నుంచి ఐదు రోజులపాటు సీపీఐ జాతీయ మహాసభలు జరుగనున్నాయి. దాదాపు 750 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Leader Narayana) మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై జాతీయ మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సీపీఐలో 75 ఏళ్ల వయోపరిమితి అమలుపై సీపీఐ మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంకలో అవినీతి, నిరుద్యోగం పెరిగి యువత తిరగబడ్డారన్నారు.
కేంద్రం అన్ని వ్యవస్థలను కంట్రోల్ చేస్తోందన్నారు. అదానీ గ్రూప్‌కు సెబీ క్లీన్ చిట్ ఇచ్చిందని.. అండమాన్ నికోబర్ దీవులను అదానికి అప్పగించారన్నారు. అదానీకి మద్దతుగా ప్రధాని మోదీ నిలుస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. అదానీకి వచ్చే ఆదాయాన్ని సగటుగా వచ్చే ఆదాయంతో పోల్చి తలసరి ఆదాయం లెక్కగడతారా? అని ప్రశ్నించారు. సెల్ ఫోన్లు, కార్లు పెరిగాయని రేషన్ బియ్యం తినేవారు లేరని రేషన్ కార్డులను తొలగించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
రేషన్ బియ్యం అమ్మేవారిని పట్టుకోకుండా రేషన్ కార్డులు తొలగించాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో కాకినాడలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారని అన్నారు. ఫుట్ పాత్‌పై పడుకునే వాడు కూడా సెల్ ఫోన్ వాడుతున్నారని తెలిపారు. ఫోన్ వాడినంత మాత్రాన పేదరికం లేనట్లా అంటూ నారాయణ ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి
మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగిసిన సిట్ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
Read Latest National News And Telugu News