Minister Nara Lokesh on RDT Services: ఆర్డీటీ సేవలపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ
ABN , Publish Date - Sep 21 , 2025 | 04:42 PM
కేంద్రం ప్రభుత్వంతో ఆర్డీటీ సేవల గురించి మాట్లాడుతున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఆర్డీటీ అని ఉద్ఘాటించారు. మానవత్వానికి చిరునామా మాంఛో ఫెర్రర్ అని మంత్రి నారా లోకేష్ ప్రశంసించారు.
అమరావతి, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఆర్డీటీ (RDT) (Rural Development Trust) సేవలపై క్లారిటీ ఇచ్చారు. రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ మాంఛో ఫెర్రర్ నిర్వాహకులతో ఇవాళ (ఆదివారం) ఉండవల్లిలోని తన నివాసంలో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా ఆర్డీటీ (RDT) సేవలపై కీలక ప్రకటన చేశారు. ఆర్డీటీ (RDT) సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్.
కేంద్రం ప్రభుత్వంతో ఆర్డీటీ (RDT) సేవల గురించి మాట్లాడుతున్నామని వివరించారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పుకొచ్చారు. పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపింది ఆర్డీటీ అని ఉద్ఘాటించారు. మానవత్వానికి చిరునామా మాంఛో ఫెర్రర్ అని ప్రశంసించారు. ఆర్డీటీ (RDT)అంటే ఒక స్వచ్ఛంద సంస్థ కాదని... లక్షలాది మంది పేదల బతుకుల్లో వెలుగు నింపిన ఆశాకిరణమని నొక్కిచెప్పారు. ఆర్డీటీ(RDT) వంటి మానవతా సంస్థకు తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చాయని తెలిపారు. వాటిని శాశ్వతంగా పరిష్కరించి ఆర్డీటీ(RDT) సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకో.. రఘురామ ప్రశ్నల వర్షం
కరుణాకర్ రెడ్డికి ముందుంది ముసళ్ల పండగ.. భాను ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest AP News And Telugu News