Share News

Tirupati Police on Kapila Theertham: కపిలతీర్థంలో ఎలాంటి తొక్కిసలాట జరుగలేదు.. తిరుపతి పోలీసులు క్లారిటీ

ABN , Publish Date - Sep 21 , 2025 | 03:48 PM

మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం వద్ద తొక్కిసలాట జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తిరుపతి పోలీసు అధికారులు స్పందించారు. కపిలతీర్థంలో తొక్కిసలాట జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తిరుపతి పోలీసు అధికారులు పేర్కొన్నారు.

Tirupati Police on Kapila Theertham: కపిలతీర్థంలో ఎలాంటి తొక్కిసలాట జరుగలేదు.. తిరుపతి పోలీసులు క్లారిటీ
Tirupati Police on Kapila Theertham

తిరుపతి జిల్లా, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మహాలయ అమావాస్య (Mahalaya Amavasya) సందర్భంగా కపిలతీర్థం వద్ద తొక్కిసలాట జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తిరుపతి పోలీసు అధికారులు స్పందించారు. ఇవాళ(ఆదివారం) మీడియాతో తిరుపతి పోలీసు అధికారులు మాట్లాడారు. కపిలతీర్థం (KapilaTirtham)లో తొక్కిసలాట జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వార్తలు అసత్యమని కపిలతీర్థం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి తొక్కిసలాట జరుగలేదని క్లారిటీ ఇచ్చారు తిరుపతి పోలీసు అధికారులు.


భక్తుల రద్దీని పూర్తిగా నియంత్రిస్తూ సజావుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. తప్పుడు సమాచారం సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు నిజమైన సమాచారం కోసం పోలీస్ శాఖ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రత కోసం తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం నిత్యం కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ‘ప్రజల భద్రత – మా ప్రధాన లక్ష్యం’ అని ఉద్ఘాటించారు తిరుపతి పోలీసు అధికారులు.


మహాలయ అమావాస్య – కపిలతీర్థం వద్ద పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేసిందని తెలిపారు . ఈరోజు(ఆదివారం) మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతి కపిలతీర్థం ఆలయంలో తర్పణాలు వదిలే సమయంలో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించడానికి అదనపు పోలీస్ సిబ్బందిని నియమించామని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ రద్దీ లేకుండా వాహనాల కదలికలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశామని వివరించారు తిరుపతి పోలీసు అధికారులు.


వాహనాల పార్కింగ్ స్థలం పరిమితంగా ఉండటంతో, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. జిల్లా ఎస్పీ శ్రీ ఏల్. సుబ్బరాయుడు, ఐపీఎస్ స్వయంగా కపిలతీర్థం ఆలయ పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు ఇస్తూ ఏర్పాట్లను పరిశీలించారని పేర్కొన్నారు తిరుపతి పోలీసు అధికారులు.


ఈ వార్తలు కూడా చదవండి

జగన్ అసెంబ్లీ రూల్స్ తెలుసుకో.. రఘురామ ప్రశ్నల వర్షం

కరుణాకర్ రెడ్డికి ముందుంది ముసళ్ల పండగ‌‌‌‌‌.. భాను ప్రకాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 21 , 2025 | 04:50 PM