Share News

Devineni Uma Meets Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన దేవినేని ఉమా.. కీలక అంశాలపై చర్చ

ABN , Publish Date - Dec 12 , 2025 | 01:17 PM

చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఇవాళ(శుక్రవారం) దేవినేని ఉమా కలిశారు.

Devineni Uma Meets Chandrababu: సీఎం చంద్రబాబును కలిసిన దేవినేని ఉమా.. కీలక అంశాలపై చర్చ
Devineni Uma Meets Chandrababu

అమరావతి, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు (Devineni Uma Maheswara Rao). మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని ఇవాళ(శుక్రవారం) దేవినేని ఉమా కలిశారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ ప్రాంత రైతుల చిరకాల స్వప్నమైన చింతలపూడి ఆవశ్యకత గురించి సీఎంకు వివరించారు.


గోదావరి జలాలు ఈ ప్రాంతానికి వస్తే రైతులు ఇక్కట్లు తీరి సిరుల పంటలు పండుతాయని చెప్పుకొచ్చారు. ఉమ్మడి కృష్ణ, ఉభయ గోదావరి జిల్లాల్లోని 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. 35 మండలాల్లోని 25 లక్షల మందికి పైగా ప్రజలకు తాగునీరు అందిస్తోందని వెల్లడించారు.


ఈ బృహత్తర పథకానికి గత తెలుగుదేశం హయాంలో శంకుస్థాపన చేసి శరవేగంగా పనులు జరిగాయని వివరించారు. ఇప్పటికే ఈ పథకానికి రూ. 4,170 కోట్లు వ్యయం చేశారని తెలిపారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ అసమర్థ, అవినీతి పాలనలో ఆగిపోయిన ఈ ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులను అధిగమించి పూర్తి చేస్తామని దేవినేని ఉమా పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దువ్వాడ మాధురి శ్రీనివాస్‌‌‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..

అల్లూరి జిల్లా బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 12 , 2025 | 01:24 PM