EX Minister Devineni Umamaheswara Rao: చీకటి పాలన నుంచి.. పారదర్శక పాలన దిశగా..
ABN , Publish Date - Dec 31 , 2025 | 04:10 PM
కూటమి సర్కార్ పాలనలో రాష్ట్రం చీకటి పాలన నుంచి పారదర్శక పాలన దిశగా ముందుకు సాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాడు అన్ని రంగాల్లోనూ వెనుకబడిన రాష్ట్రాన్ని.. సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి గాడిలో పెట్టారని చెప్పారు.
ఎన్టీఆర్ జిల్లా: కూటమి సర్కార్ పాలనలో రాష్ట్రం చీకటి పాలన నుంచి పారదర్శక పాలన దిశగా ముందుకు సాగుతోందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నాడు అన్ని రంగాల్లోనూ వెనుకబడిన రాష్ట్రాన్ని.. సీఎం చంద్రబాబు నాయుడు తిరిగి గాడిలో పెట్టారని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. పెట్టుబడులు, భారీ ప్రాజెక్టులతో పాటూ రూ.1.35 లక్షల కోట్లతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటయయ్యాయని గుర్తుచేశారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. అలాగే విద్య వ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని దేవినేని పేర్కొన్నారు.
ఇవి కూడా చదివండి...
జనవరి 8న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్
దారుణం.. భార్యను పచ్చడి బండతో కొట్టి చంపిన భర్త
Read Latest AP News And Telugu News