ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: సుప్రీంలో నేడు చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై ప్రస్తావన..

ABN, First Publish Date - 2023-09-25T08:33:10+05:30

న్యూఢిల్లీ: చంద్రబాబు నాయుడు క్వాష్ పిటీషన్‌పై సోమవారం సుప్రీం కోర్టులో ప్రస్తావించనున్నారు. సీజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం ముందు చంద్రబాబు తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్దార్థ్ లూత్రా ప్రస్తావించనున్నారు. వెంటనే పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరనున్నారు.

న్యూఢిల్లీ: చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) క్వాష్ పిటీషన్‌ (Quash Petition)పై సోమవారం సుప్రీం కోర్టు (Supreme Court)లో ప్రస్తావించనున్నారు. సీజేఐ డివై చంద్రచూడ్ (CJI DY Chandrachud) ధర్మాసనం ముందు చంద్రబాబు తరఫున సీనియర్ కౌన్సిల్ సిద్దార్థ్ లూత్రా (Siddharth Luthra) ప్రస్తావించనున్నారు. వెంటనే పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని కోరనున్నారు. ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీం కోర్ట్‌కు సెలవుల నేపథ్యంలో మంగళవారం చంద్రబాబు క్వాష్ పెటేషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు (Skill Development Case)లో క్వాష్ పిటీషన్‌పై హైకోర్టు (High Court) తీర్పును చంద్రబాబు సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో శనివారం స్పెషల్ లీవ్ పిటీషన్‌ను లాయర్ గుంటూరు ప్రమోద్ కుమార్ దాఖలు చేశారు.

కాగా దర్యాప్తు తుది దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమంటూ గత శుక్రవారం క్వాష్ పిటీషన్‌ను హైకోర్టు త్రోసి పుచ్చింది. సెక్షన్ 482 కింద దాఖలైన వ్యాజ్యంలో మినీ ట్రయల్ నిర్వహించలేమని న్యాయస్థానం పేర్కొంది. సీమెన్స్‌కు నిధుల విడుదలకు సిఫారసులతో నిధుల దుర్వినియోగమని, ఇది అస్పష్టమైన వ్యవహారమని, నిపుణులతో చర్చించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. దీంతో 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని సుప్రీం కోర్టులో ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటీషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T10:17:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising