ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP Protest: ఏపీలో దివాళా బడ్జెట్ అంటూ టీడీపీ ఆందోళన.. పాల్గొన్న బాలకృష్ణ

ABN, First Publish Date - 2023-03-16T09:54:10+05:30

ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద గురువారం ఉదయం తెలుగుదేశం శాసనసభ పక్షం నిరసనకు దిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నమైందంటూ సచివాలయం అగ్నిమాపక కేంద్రం వద్ద గురువారం ఉదయం తెలుగుదేశం శాసనసభ పక్షం నిరసన (The Telugu Desam Legislature protested)కు దిగింది. ఈ నిరసనలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (MLA Nandamuri Balakrishna) పాల్గొన్నారు. ఏపీ (AP)లో దివాళా బడ్జెట్ అంటూ బ్యానర్‌ను ప్రదర్శించారు. జగన్ రెడ్డి కళ కళ, ప్రజలు విలవిల అంటూ టీడీపీ నేతలు ప్లకార్డుల ప్రదర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP state president Achchennaidu) మాట్లాడుతూ... ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించే దిశగా ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందన్నారు. నాలుగేళ్లలో రాష్ట్రానికి పదిన్నర లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందని తెలిపారు. పేదల సంక్షేమానికి లక్షన్నర కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు ప్రభుత్వం చెప్తోందని.. మిగిలిన ఆదాయం ఏమైందని ప్రశ్నించారు. నాలుగేళ్లలో 9లక్షల కోట్లపై చిలుకు అప్పులు చేశారన్నారు. అప్పుల అప్పారావు లా తయారైన జగన్మోహన్ రెడ్డి ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. ప్రతీ 100 మందిలో 47మందిపై అప్పు ఉందంటే రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారు అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా.. పదే పదే సభాకార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ నిన్న ఏపీ అసెంబ్లీలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (YCP rebel MLA Kotamreddy Sridhar Reddy) తో పాటు 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం సభ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్ (Payyavula Kesav), నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu)ను సెషల్ మొత్తానికి సస్పెండ్ చేయగా.. మిగిలిన టీడీపీ సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

Updated Date - 2023-03-16T09:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising