ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: మరోసారి రెచ్చిపోయిన జోగి రమేష్ అనుచరులు

ABN, First Publish Date - 2023-04-22T22:12:04+05:30

జిల్లాలో జిగూడూరులో మరోసారి మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అనుచరులు రెచ్చిపోయారు.

కృష్ణా: జిల్లాలో జిగూడూరులో మరోసారి మంత్రి జోగి రమేష్ (Jogi Ramesh) అనుచరులు రెచ్చిపోయారు. మట్టి మాఫియాపై ఫిర్యాదు చేశారనే అక్కసుతో యువకులపై‌ దాడికి పాల్పడ్డారు. రాజకీయ కారణాలతో తమ పార్టీ కార్యకర్తలును కొట్టారని జనసేన (Janasena) నేత బండ్రెడ్డి రాము ఆందోళనకు దిగారు. గూడూరు మండలం ఆకుమర్రు లాకుల వద్ద అక్రమ మట్టి రవాణా జరుగుతున్నట్లు... సమాచారం తెలుసుకుని పట్టించేందుకు జనసేన కార్యకర్తలు అక్కడకి‌ వెళ్లారు. వారిపై మంత్రి జోగి రమేష్ అనుచరులు దాడి పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. రామకృష్ణ అనే జనసైనికుడిని స్థంభానికి కట్టేసి చితక‌బాదారని వారు వాపోతున్నారు. తీవ్రంగా గాయపడిన రామకృష్ణను బందరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం బయటకి రాకుండా రాజీ చేసేందుకు అధికార పార్టీ నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఆస్పత్రి వద్దకు జనసేన నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. దాడికి పాల్పడ్డ జోగి రమేష్ అనుచరులును అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

జిల్లాలో మంత్రి జోగి రమేష్ అరాచకాలు పెరిగి పోయాయని జనసేన నేత బండ్రెడ్డి రాము ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ ధనం దోచేస్తున్న అధికారులు పట్టించుకోరని ఆరోపించారు. తమ లాంటోళ్లు అడిగితే...‌ బరి తెగించి చంపేస్తారా? అంంటూ మండిపడ్డారు. ఇంత జరిగినా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. నిందితులను‌ వదిలేసి బాధితులపై కేసులు పెట్టడం ధర్మం కాదన్నారు. మంత్రి జోగి రమేష్‌కి తప్పకుండా వచ్చే ఎన్నికలలో బుద్ది చెబుతామన్నారు.

Updated Date - 2023-04-22T22:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising