ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

DL On CBN Arrest : మాజీ ముఖ్యమంత్రి, 73 ఏళ్ల వ్యక్తి విదేశాలకు పారిపోతారా?

ABN, First Publish Date - 2023-09-16T14:28:40+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు మీద లేని కేసులు సృష్టించి అక్రమ అరెస్టు చేయడం దారుణమని.. రిమాండ్ విధించడం అనేది కూడా తప్పు అని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యలు చేశారు.

కడప: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) మీద లేని కేసులు సృష్టించి అక్రమ అరెస్టు చేయడం దారుణమని.. రిమాండ్ విధించడం అనేది కూడా తప్పు అని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డి (Former Minister DL Ravindra Reddy)వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థను విమర్శించకూడదని ఎక్కడా లేదన్నారు. 28 పేజీల రిమాండ్ రిపోర్టులో ఎక్కడా చంద్రబాబు తప్పు చేసినట్లు లేదన్నారు. నిజాలను వెలికి తీయడానికి రిమాండ్ ఎందుకు విధించారని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థలో ఇలాంటి జడ్జి ఎవరూ ఉండరు అనుకుంటున్నానని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి, 73 ఏళ్ల వ్యక్తి విదేశాలకు పారిపోతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు పిలిచినా కోర్టుకు హాజరై సహరించే వ్యక్తి అని చెప్పుకొచ్చారు. జగన్ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. నంద్యాలలో అరెస్టు చేసి అక్కడ కోర్టులో హాజరుపెట్టకుండా విజయవాడకి ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని న్యాయవ్యవస్థ పున:పరిశీలించాలని డీఎల్ రవీంద్రారెడ్డి కోరారు.

Updated Date - 2023-09-16T14:54:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising