ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawankalyan: అందుకేనేమో వాజ్‌పేయి భారతరత్నగా గుండెల్లో నిలిచిపోయారు

ABN, First Publish Date - 2023-08-16T10:17:01+05:30

దివంగత నేత, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి వర్థంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రద్ధాంజలి ఘటించారు.

అమరావతి: దివంగత నేత, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి (Former Prime Minister Atal Bihari Vajpayee) వర్థంతి సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) శ్రద్ధాంజలి ఘటించారు. దేశం కోసమే పుట్టిన మహానుభావులు ఎందరో అని అటువంటి వారిలో మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిని ప్రముఖంగా చెప్పుకోవచ్చన్నారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే వందలు వేలకోట్ల ఆస్తులను సంపాదించే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజులలో... మూడుసార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా పని చేసినప్పటికీ చరమాంకంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహంలోనే తనువు చాలించిన వాజ్‌పేయి గురించి ఏమని చెప్పాలని అన్నారు. అందుకేనేమో ఆయన భారతరత్నగా అందరి గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయారని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రిగా ఆయన హయాంలో భారత దేశం ఎన్నో విజయాలను చవిచూసిందని తెలిపారు. అణుపరీక్షలు జరిపి భారతదేశాన్ని అణ్వస్త్ర దేశంగా నిలిపింది ఆయనే అని అన్నారు. అరుదైన నాయకుడి వర్ధంతి సందర్భాన ఆ మహానాయకునికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని.. తన పక్షాన, జనసేన పక్షాన పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు.

Updated Date - 2023-08-16T10:21:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising