AP NEWS: గుంటూరు జిల్లాలో అంగన్వాడీ కేంద్రం వద్ద ఉద్రిక్తత
ABN, Publish Date - Dec 18 , 2023 | 12:04 AM
జిల్లాలోని తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టటానికి సచివాలయ సిబ్బందితో వీఆర్వో వచ్చారు.
గుంటూరు జిల్లా: జిల్లాలోని తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అంగన్వాడీ కేంద్రం తాళం పగలగొట్టటానికి సచివాలయ సిబ్బందితో వీఆర్వో వచ్చారు. అంగనవాడీ టీచర్ల సమస్యలు తీరేవరకు తాళాలు తీయడానికి వీలులేదని వీఆర్వో, సచివాలయ సిబ్బందిని టీడీపీ జనసేన, సీపీఎం నాయకులు అడ్డుకున్నారు. అంగన్ వాడీ కేంద్రం వద్దకు గ్రామస్తులు చేరుకున్నారు. గ్రామస్తులను తాడేపల్లి పోలీసులు నెట్టిపడేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల చర్యతో ఆందోళనకు ఉండవల్లి గ్రామస్తులు దిగారు.
Updated Date - Dec 18 , 2023 | 12:04 AM