ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu High Court: చంద్రబాబు బెయిల్‌పై తీర్పు రిజర్వ్

ABN, First Publish Date - 2023-09-26T14:21:20+05:30

అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై (Chandrababu) హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు

అమరావతి: అంగళ్లు కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై (Chandrababu) హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, ప్రాసిక్యూషన్ తరపున పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా అంగళ్లులో చోటుచేసుకున్న అల్లర్ల కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ఏ1గా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 22న ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం 26వ తేదీకి (మంగళవారం) వాయిదా వేసింది. ఈరోజు ఇరువైపులా వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? లేదా? అన్న టెన్షన్ టీడీపీ శ్రేణుల్లో నెలకొంది.

Updated Date - 2023-09-26T14:21:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising