Ramesh Naidu: జగన్ పాలనలో కోతలు తప్ప ఇంకేమీ లేవు
ABN, First Publish Date - 2023-09-05T16:48:06+05:30
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో కోతలు తప్ప ఇంకేమీ లేవని, ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కరెంట్ కోతలు చూస్తున్నామని ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు విమర్శించారు. రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీకి కరెంటు కోతలు ఉండవని.. తెలంగాణకు ఆ సమస్యలు ఉంటాయని మన పెద్దలు చెప్పారన్నారు.
న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పాలనలో కోతలు తప్ప ఇంకేమీ లేవని, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో కొత్తగా కరెంట్ కోతలు (Current Cuts) చూస్తున్నామని ఏపీ బీజేపీ (BJP Leader) రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు (Ramesh Naidu) విమర్శించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీకి కరెంటు కోతలు ఉండవని.. తెలంగాణ (Telangana)కు ఆ సమస్యలు ఉంటాయని మన పెద్దలు చెప్పారన్నారు. అయితే ఏపీలో విద్యుత్ ప్రాజెక్టులకు కావలసినన్ని వనరులు ఉన్నప్పటికీ జగన్ పాలనాలో కోతలు తప్ప ఏమీ లేవని అన్నారు. సీఎం చేతకాని తనంతో పల్లె సీమలు చీకట్లో మగ్గిపోతున్నాయని, విద్యార్థులు దీపాలు పెట్టుకొని చదువుకునే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలంటే వీధి బుడ్డిల కింద చదువుకున్నామని చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు.
క్రాఫ్ హాలిడేలు, పరిశ్రమలు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకే పనిచేయాలని ఆ పైన పని చేస్తే జరిమానా విధిస్తున్నారని రమేష్ నాయుడు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని, మైమరిపించడం మాయ చేయడం తప్ప ఏమీ లేదని దుయ్యబట్టారు. ఐదో తేదీ వచ్చినప్పటికీ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని, కేంద్రం కనికరిస్తే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఏపీ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఇసుక, ఎర్రచందనం, మద్యం జగన్‌కు ఆదాయంగా మారిందని, సజ్జల రామకృష్ణ రెడ్డి అమర్ రాజా బ్యాటరీస్ లాంటి సంస్థను వెళ్లిపోవాలని చెప్పిన ఉదంతాలు చూశామన్నారు. జగన్ అరాచకపాలనకు మరో ఆరు నెలలు మాత్రమే ఉందని ప్రజలు అనుకుంటున్నారన్నారు. ప్రభుత్వంలో, పార్టీలో జగన్ పట్టుకోల్పోయారని, ఓటమి అంచులోకి వెళ్ళిపోయారని రమేష్ నాయుడు వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-09-05T16:52:49+05:30 IST