Achchennaidu : న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది
ABN, First Publish Date - 2023-09-22T17:10:54+05:30
హైకోర్టు(High Court) తీర్పుతో ఎక్కడా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు.
అమరావతి: హైకోర్టు(High Court) తీర్పుతో ఎక్కడా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని చెప్పలేదని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Achchennaidu) వ్యాఖ్యానించారు. శుక్రవారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ సమయంలో జోక్యం చేసుకోలేమని మాత్రమే హైకోర్టు చెప్పింది. న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది. క్షేత్ర స్థాయిలో చంద్రబాబుకు మద్దతుగా ఉద్యమాలు కొనసాగిస్తాం. గ్రామాల్లో బాబుతో నేను కార్యక్రమం ద్వారా ప్రతి గడపకూ వెళ్తాం. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో రిలే నిరాహార దీక్ష సైతం కొనసాగిస్తాం. చంద్రబాబు అక్రమ అరెస్టుని క్షేత్రస్థాయిలోకి తీసుకుని వెళ్తాం. టీడీపీ ఎన్నో సంక్షేమాలను ఎదుర్కొంది ఈ సంక్షోభాలు అంత కష్టమైంది ఏం కాదు. టీడీపీకి బలం కార్యకర్తలే. ఎక్కడ కూడా కార్యకర్తలు మనోధైర్యం కోల్పోలేదు. హైకోర్టు తీర్పుపై న్యాయనిపుణులతో చర్చిస్తున్నాం. ఎలా ముందుకెళ్లాలని దానిపై అడ్వకెట్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. అరెస్ట్ చేసిన రోజు 9 గంటల పాటు విచారణ జరిపారు. కస్టడీకి ఇచ్చినా కొత్తగా ఏం సమాచారం ఉంటుంది? సీఐడీ కస్టడీ కేవలం చంద్రబాబును ఇబ్బందులు పెట్టడానికే తీసుకుంటున్నారు’’ అని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
Updated Date - 2023-09-22T17:11:03+05:30 IST