Prathipati Pullarao: అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసేందుకు వచ్చిన వ్యక్తిపై ఏంటీ దాష్టీకం?
ABN, Publish Date - Dec 23 , 2023 | 11:31 AM
Andhrapradesh: తల్లికి అనారోగ్యంగా ఉందని చూడటానికి వచ్చిన వ్యక్తిపై దాష్టీకం ఏమిటని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ పోలీసుల తీరు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా ఉందన్నారు. వైసీపీ ప్రైవేట్ సైన్యంలా సీఐడీ వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు.
గుంటూరు: తల్లికి అనారోగ్యంగా ఉందని చూడటానికి వచ్చిన వ్యక్తిపై దాష్టీకం ఏమిటని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు (Former Minister Prathipati Pullarao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐడీ పోలీసుల తీరు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా ఉందన్నారు. వైసీపీ ప్రైవేట్ సైన్యంలా సీఐడీ వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్ వైఫల్యాలను ప్రశ్నించడమే నేరమా? అని ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడితే వెంటాడి అరెస్టు చేస్తారా అంటూ నిలదీశారు. ఎన్‌ఆర్‌ఐ యాష్ బొద్దులూరి చేసిన నేరం ఏమిటని అడిగారు. 41ఏ నోటీసులు ఇవ్వాలని కోర్టులు పదేపదే చెబుతున్నా సీఐడీకి పట్టదా అని మండిపడ్డారు. ప్రశ్నించేవారి గొంతు నొక్కడమే లక్ష్యంగా సీఐడీ పనిచేస్తోందన్నారు. ఎవరు గొంతెత్తినా భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా సీఐడీ పనిచేస్తోందని ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Dec 23 , 2023 | 11:31 AM