ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeshwari: తెలుగు చిత్ర పరిశ్రమకు నిజంగా గర్వకారణం

ABN, First Publish Date - 2023-08-25T11:17:21+05:30

తెలుగు సినీ పరిశ్రమకు జాతీయ అవార్డులు రావడం పట్ల ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.

అమరావతి: తెలుగు సినీ పరిశ్రమకు (Telugu film industry) జాతీయ అవార్డులు (National Awards) రావడం పట్ల ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeshwari) హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘తెలుగు చిత్ర పరిశ్రమకు నిజంగా గర్వకారణం!!! పుష్పలో నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ అవార్డు అందుకున్నందుకు అభినందనలు. అవార్డుల పుష్ప గుచ్ఛాన్ని అందుకున్నందుకు ఆర్‌ఆర్‌ఆర్ మొత్తం టీమ్‌కి అభినందనలు’’ అంటూ పురందేశ్వరి ట్వీట్ చేశారు.


భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. 2021 ఏడాదికి గాను 69వ జాతీయ పురస్కారాలను కేంద్రం గురువారం వెల్లడించింది. ఈ అవార్డుల్లో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. తెలుగు సినిమా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పాయి. అల్లు అర్జున ఉత్తమ జాతీయ నటుడిగా అవార్డ్ అందుకొని.. 69 ఏళ్ల చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి తెలుగు నటుడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం జాతీయ పురస్కారాల్లోనూ సత్తా చాటింది. ఏకంగా ఆరు విభాగాల్లో అవార్డుల్ని సొంతం చేసుకుంది. ఉప్పెన సినిమా, దేవిశ్రీ ప్రసాద్సంగీతం, చంద్రబోస్ సాహిత్యం.. ఇలా మొత్తంగా ఓ 10 అవార్డులు తెలుగు సినిమా ఇండస్ట్రీ సొంతమయ్యాయి. జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమాకు పలు అవార్డు రావడంతో ఇండస్ట్రీకి చెందిన వాళ్లు సంబరాలు జరుపుకుంటున్నారు.

Updated Date - 2023-08-25T11:17:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising