ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD EO: ‘ఫేస్ రికగ్నిషన్’ సత్ఫలితాలను ఇస్తోందన్న టీటీడీ ఈవో

ABN, First Publish Date - 2023-03-02T12:56:39+05:30

తిరుమలలో అమలులోకి వచ్చిన ‘‘ఫేస్ రికగ్నిషన్’’ విధానం సత్ఫలితాలు ఇస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిరుమల: తిరుమలలో అమలులోకి వచ్చిన ‘‘ఫేస్ రికగ్నిషన్’’ (Face recognition) విధానం సత్ఫలితాలు ఇస్తోందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... నూతన విధానం ద్వారా దళారీల బెడద తప్పిందన్నారు. గదులు రొటేషన్ చేసే విధానం కూడా ఆగిపోయిందని చెప్పారు. ఈ విధానంతో నిజమైన భక్తులే గదులు పొందుతున్నారన్నారు. ఈ విధానం ప్రవేశ పెట్టడంతో భక్తులకు త్వరగతిన గదులు లభిస్తున్నాయని తెలిపారు. సర్వదర్శనం భక్తులకు ఈ విధానం ద్వారానే ఉచిత లడ్డు టోకెన్లను జారీ చేస్తున్నట్లు చెప్పారు. రానున్న రోజుల్లో ఈ విధానాన్ని ఇంకా పటిష్టం చేస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి పేర్కొన్నారు.

నిన్నటి (మార్చి 1)నుంచి తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ యాప్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్‌ చెల్లింపునకు ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఈ యాప్ ద్వారా దర్శనం, లడ్డూల పంపిణీలో అవకతవకలు జరిగే అవకాశం ఉండదని టీటీడీ భావిస్తోంది.

Updated Date - 2023-03-02T12:56:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!