ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం

ABN, First Publish Date - 2023-02-05T11:13:53+05:30

నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) ఆదివారం పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) ఆదివారం పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లి క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా తవణంపల్లిలో గాండ్ల సామాజిక వర్గీయులతో భేటీ అయ్యారు. కాగా పాదయాత్ర ప్రారంభించే ముందు తనను కలవడానికి వచ్చిన నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలతో సెల్ఫీ (Selfie) దిగారు. యువనేత ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంపై అందరూ ఆనందం వ్యక్తం చేశారు.

లోకేష్ యువగళం పాదయాత్ర పది రోజులు పూర్తికాగానే వైసీపీ నేతల (YCP Leaders)కు అధికారం కోల్పోయామనే నిర్ణయానికి వచ్చి కార్యకర్తలపై అడ్డదిడ్డంగా.. అక్రమ కేసులు బనాయిస్తున్నారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు (Devathoti Nagaraju) మాట్లాడుతూ యువగళం పాదయాత్ర టీడీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్నిస్తోందన్నారు. ప్రజలకు భవిష్యత్తు మీద భరోసా కల్పిస్తోందన్నారు. భవిష్యత్తులో కొత్తగా నిర్మితమయ్యే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లోకేష్ సువర్ణ అక్షరాలతో నిలిచిపోతారని పేర్కొన్నారు. వైసీపీ నేతల అడ్డగోలు మాటలకు, అరాచకాలకు, విధ్వంసకర విధానాలకు, హత్యా రాజకీయాలకు యువగళం పాదయాత్ర అడ్డుకట్ట వేస్తుందన్నారు. కాగా 11:30 గంటలకు కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో లోకేష్‌ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సాయంత్రం 4:20 గంటలకు కాణిపాకంలో యువతతో ముఖాముఖి మాట్లాడతారు. రాత్రి 7:40 గంటలకు తెల్లగుండ్ల గ్రామస్తులతో సమావేశం నిర్వహిస్తారు. రాత్రి మంగసముద్రంలో లోకేష్‌ బస చేస్తారు.

Updated Date - 2023-02-05T11:13:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising