ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chittoor: ఎనిమిదో రోజు లోకేష్ పాదయాత్ర ఇలా..

ABN, First Publish Date - 2023-02-03T11:41:00+05:30

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్ర (Padayatra) 8వ రోజు శుక్రవారం ఉదయం పూతలపట్టు నియోజకవర్గం, మొగిలి ఈశ్వరాలయం నుంచి ప్రారంభించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) ‘యువగళం’ పాదయాత్ర (Padayatra) 8వ రోజు శుక్రవారం ఉదయం పూతలపట్టు నియోజకవర్గం, మొగిలి ఈశ్వరాలయం నుంచి ప్రారంభించారు. కాగా బస ప్రాంతంలో తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలతో కలిసి లోకేష్ సెల్ఫీలు దిగారు. యువనేతను ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడంపై ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. తర్వాత స్వయంభు శ్రీ మొగిలీశ్వరస్వామి దేవస్థా

నంలో లోకేష్ ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, ప్రజల మధ్య పాదయాత్ర ప్రారంభించారు.

కాసేపట్లో బలిజపల్లి గ్రామస్తులతో లోకేష్‌ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 4:35 గంటలకు వెంకటగిరి జామీయా మసీదులో ప్రార్థనలు చేయనున్నారు. 5 గంటలకు బంగారుపల్లిలో లోకేష్‌ బహిరంగసభలో ప్రసంగించనున్నారు. రాత్రి వజ్రాలపురంలో బస చేయనున్నారు. కాగా పలమనేరు సమీపంలోని గాంధీనగర్‌ క్రాస్‌ వద్ద గురువారం పాదయాత్రగా వస్తున్న లోకేశ్‌ను బీజేపీ నేతలు కలిసి సంఘీభావం తెలిపారు. చిన్న వయసులో పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌ భవిష్యత్‌లో మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు గుత్తా నారాయణస్వామి నాయుడు, ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బాలకృష్ణ, దీనదయాల్‌, పలువురు నేతలు పాల్గొన్నారు.

7వ రోజు గురువారం ఉదయం పలమనేరు మండలం, క్యాటిల్‌ ఫారం వద్ద గల రెడ్డి సదాశివనగర్‌లోని విడిది క్యాంప్‌ నుంచి లోకేష్ పాదయాత్ర మొదలైంది. షెడ్యూల్‌ ప్రకారం 9 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా.. యువకులు, మహిళలు భారీగా రావడంతో వారితో ఫొటోలు తీసుకోవడంతో గంట ఆలస్యంగా మొదలైంది. యాత్ర 16.2 కిలోమీటర్లు సాగింది. దారి పొడవునా మహిళల కర్పూర హారతులు అందుకుంటూ.. స్థానికులు, పార్టీ శ్రేణుల స్వాగత సత్కారాలు స్వీకరిస్తూ.. అన్ని వర్గాల ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ.. భవితపై భరోసానిస్తూ పాదయాత్ర సాగింది. పలమనేరులోని టవర్‌ క్లాక్‌ వద్ద పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. దీనికి యువకులనుంచి మంచి స్పందన లభించింది. అనంతరం లోకేశ్‌ మార్కెట్‌యార్డ్‌ వద్ద టమోటా రైతుల గజమాల ఆహ్వానంతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. అక్కడినుంచి పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలోని మొగిలి వద్ద ఏర్పాటుచేసిన విడిది క్యాంపునకు చేరుకున్నారు.

Updated Date - 2023-02-03T11:41:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising