ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nara Lokesh : వాటితో పాటే నా స్టూల్ కూడా ఎత్తుకుపోయారు

ABN, First Publish Date - 2023-02-04T12:15:48+05:30

వ్యవసాయ మంత్రి ఉన్నాడు.. అతను కోర్టులో దొంగతనం చేసి ఓక ఫైల్ పటుకెళ్లారన్నారు. ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకు వెళతారని.. ఆయనేమో ఏకంగా కోర్టుల్లోనే దొంగతనం చేస్తాడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర నేడు 9వ రోజుకు చేరుకుంది. ఆయన పర్యటన చిత్తూరు జిల్లా (Chittor District)లో కొనసాగుతోంది. ఈ క్రమంలోనే నేడు బంగారుపాళ్యం మండలం తుంబ కుప్పం క్రాస్ రోడ్డు వద్ద నారా లోకేష్ మాట్లాడుతూ.. పాదయాత్రకు సంబంధించిన రెండు సౌండ్ సిస్టం వాహనాలను పోలీసులు పట్టుకెళ్ళారని.. వాటితో పాటు తన స్టూల్ కూడా పట్టుకు పోయారన్నారు. మీ ఎస్పీకి స్టూల్ కావాలంటే తనను అడిగితే పంపిస్తానని.. కానీ ఇలాంటి పనికిమాలిన పనులు వద్దని సూచించారు.

100 కి.మీ.పాదయాత్ర పూర్తి కాక ముందే తనపై 16వ కేసు పెట్టారని నారా లోకేష్ వెల్లడించారు. కోవిడ్ నుంచి మామిడి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. వాటిపై మండలిలో మాట్లాడానన్నారు. వ్యవసాయ మంత్రి ఉన్నాడు.. అతను కోర్టులో దొంగతనం చేసి ఓక ఫైల్ పటుకెళ్లారన్నారు. ఎవరైనా దొంగతనం చేసి కోర్టుకు వెళతారని.. ఆయనేమో ఏకంగా కోర్టుల్లోనే దొంగతనం చేస్తాడని పేర్కొన్నారు. అన్నదాత కంట కన్నీరు పెడితే దేశానికి మంచిదికాదన్నారు. రైతు పండించే పంటలే అందరూ తినాలని.. ‘సీఎం జగన్ నువు వారి పంటలు కాకుండా ఇంకేమైనా తింటావా..?’ అని ప్రశ్నించారు.

బీసీలకు జగన్‌ ప్రభుత్వం ఖర్చు పెట్టింది సున్నా అని లోకేష్‌ పేర్కొన్నారు. ‘‘బీసీలకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా రుణం ఇవ్వలేదు. వెనకబడిన కులాలవారు సలహాదారులుగా పనికిరారా? జగన్‌ అతని సామాజికవర్గానికి చెందిన నేతలకు రూ.3 లక్షల జీతం.. కేబినెట్ హోదాతో సలహాదారు పదవి ఇచ్చారు. వారివల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగమైనా జరిగిందా? విజయవాడలో సభ పెట్టి ఏం పీకారు? జగన్‌ తాడేపల్లి ప్యాలెస్‌కే పరిమితం అయ్యారు. ఎన్నికల్లో ఎడాపెడా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రజలు నిలదీస్తారని జగన్‌కు భయం’’ అని నారా లోకేష్‌ పేర్కొన్నారు.

Updated Date - 2023-02-04T12:17:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising