ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gali Bhanu Prakash: బ్రాహ్మణి గురించి మాట్లాడే అర్హత రోజాకు లేదు

ABN, First Publish Date - 2023-09-20T16:55:49+05:30

మంత్రి రోజాపై నగిరి టీడీపీ ఇంఛార్జి గాలి భాను ప్రకాష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి రోజా నోరు డ్రైనేజీ అని, ఆమె 2014లో అద్దె ఇంట్లో ఉండేవారని.. ఇప్పుడు బెంగళూర్, హైదరాబాద్, చెన్నై నుంచి ప్రతి ఊరిలో ఒక సొంత ఇల్లు ఉందన్నారు.

తిరుపతి: మంత్రి రోజా (Minister Roja)పై నగిరి టీడీపీ ఇంఛార్జి గాలి భాను ప్రకాష్ (Gali Bhanu Prakash) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్బంగా బుధవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి రోజా నోరు డ్రైనేజీ అని, ఆమె 2014లో అద్దె ఇంట్లో ఉండేవారని.. ఇప్పుడు బెంగళూర్ (Banglore), హైదరాబాద్ (Hyderabad), చెన్నై (Chennai) ఇలా ప్రతి ఊరులో ఒక సొంత ఇల్లు ఉందన్నారు. ఆమెకు ఆమె నంబర్ వన్ అనుకుంటున్నారని, మేము మాత్రం ఆమెను వ్యాంప్‌గా చూస్తామన్నారు. నారా బ్రాహ్మణి (Nara Brahmani) గురించి మాట్లాడే కనీస అర్హత ఆమెకు లేదన్నారు.

మంత్రి రోజా నోరు పారేసుకునీ ఎప్పుడు బజారు మనిషిలా ప్రవర్తిస్తారని భాను ప్రకాష్ అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదని, చేసింది చెప్పటానికి వాళ్లకు ఏమి లేదని.. అందుకే డైవర్ట్ పాలిటిక్స్ చేయటానికి చంద్రబాబును అరెస్ట్ చేశారని విమర్శించారు. టీటీడీ ఉద్యోగులకు పాదిరెడు వద్ద ఇచ్చిన ప్లాట్స్ పెద్ద స్కామ్ అని ఆరోపించారు. భూమి ఉన్న వారి వద్ద నుంచి ఎకరాకు రూ. ఐదు లక్షలు చొప్పున కొనుగోలు చేసి.. ఆ సొమ్ము టీటీడీ హుండీ నుంచి తీసుకున్నారని ఆరోపించారు. ఆదాయపు పన్ను శాఖ రిటర్న్స్ తెమ్మనండి.. బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు.

ఢిల్లీ పెద్దల అపాయింట్‌మెంట్ కోసం నారా లోకేష్ ప్రయత్నం కూడా చేయలేదని, మీడియా, లీగల్ టీమ్‌తో చర్చించటానికే వెళ్ళారని భాను ప్రకాష్ అన్నారు. డబ్బు బదలాయింపు లేని దాన్ని స్కాం అని ఎలా అంటున్నారని ప్రశ్నించారు. జగన్ ఎప్పుడు సింగల్, సింగల్ అంటారని, ఆయన 2019లో సింగల్‌గా రాలేదని, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు ఎంతో మందితో కలిసారని, వారి నుంచి డబ్బులు కూడా తీసుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం చేయటానికి కేసీఆర్ (KCR).. జగన్‌ (Jagan)ను పావుగా వాడుకున్నారని భాను ప్రకాష్ అన్నారు.

Updated Date - 2023-09-20T17:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising