ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sugunamma: లోకేష్ పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుంది

ABN, First Publish Date - 2023-01-24T15:50:01+05:30

నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టబోయే పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ (TDP Ex MLA Sugunamma) అభిప్రాయపడ్డారు. యువగళం (Yuva Galam) బ్యానర్‌ను ఆమె ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు

పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టబోయే పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ (TDP Ex MLA Sugunamma) అభిప్రాయపడ్డారు. యువగళం (Yuva Galam) బ్యానర్‌ను ఆమె ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ‘‘ఏపీ (Ap) లోని 51 శాతం యువశక్తి లోకేష్ వెంట తప్పక నడుస్తారు. 40 ఏళ్ల వయసులో 400 రోజులు.. 4 వేల కిలోమీటర్లు లోకేష్ నడుస్తారు. నిరుద్యోగుల సమస్యలను లోకేష్ తెలుసుకుంటారు. అడ్డంకులు, కుతంత్రాలు చేసినా పాదయాత్ర జరిగి తీరుతుంది. ఆంక్షలు విధించి పాదయాత్రకు అనుమతి ఇవ్వడమేంటి..? శ్రీవారి ఆశీస్సులు నారా, నందమూరి కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎన్టీఆర్ (Ntr), చంద్రబాబు (Chandrababu)కు వేంకటేశ్వరస్వామి అంటే ఎంతో భక్తి. శ్రీవారిని ప్రార్థించిన తర్వాతే ఏ కార్యక్రమమైనా ఎన్టీఆర్ చేపడతారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తున్న లోకేష్ శ్రీవారిని దర్శించుకోనున్నారు. రేపు రాత్రికి తిరుమల (Tirumala)కు లోకేష్ చేరుకుంటారు. 26వ తేదీ ఉదయం శ్రీనివాసుని ఆశీస్సులు తీసుకుంటారు. 26వ తేదీ మధ్యాహ్నం తిరుపతి నుంచి రోడ్డు మార్గం ద్వారా నారా లోకేష్ కుప్పం (Kuppam) బయలుదేరుతారు. 27వ తేదీ మధ్యాహ్నం 12.03కి పాదయాత్ర ప్రారంభమవుతుంది.’’ అని వెల్లడించారు.

Updated Date - 2023-01-24T15:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising