ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Ramesh: ఏపీ ప్రజలు పశ్చాత్తాపం పడుతున్నారు..

ABN, First Publish Date - 2023-06-08T17:13:13+05:30

తిరుపతి: కేంద్రమంత్రి అమిత్ షా విశాఖ పర్యటన ఈనెల 11వ తేదీకి మార్పు జరిగిందని, ఆ రోజు ఉదయం కోయంబత్తూరు బహిరంగ సభలో పాల్గొని అనంతరం విశాఖ సభలో పాల్గొంటారని బీజేపీ నేత సీఎం రమేష్ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: కేంద్రమంత్రి అమిత్ షా (Amit Shah) విశాఖ పర్యటన (Visakha Tour) ఈనెల 11వ తేదీకి మార్పు చేయడం జరిగిందని, ఆ రోజు ఉదయం కోయంబత్తూరు బహిరంగ సభలో పాల్గొని అనంతరం విశాఖ సభలో పాల్గొంటారని బీజేపీ నేత సీఎం రమేష్ (CM Ramesh) తెలిపారు. గురువారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ సాయంత్రం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) తిరుపతికి చేరుకుంటారని, ప్రధాని మోదీ (PM Modi) పాలనలో జరిగిన అభివృద్ధిని 10వ తేదీ శ్రీకాళహస్తిలో జరిగే బహిరంగ సభలో నడ్డా వివరిస్తారన్నారు. హైడ్రోజన్‌ను తయారు చేసి ఇంపోర్ట్ చేసే స్థితికి ఇండియా చేరుకుందన్నారు. జగన్‌ (Jagan)కు ఒకే ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రజలు పశ్చాత్తాపం పడుతున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టకుండా అవినీతికి అవకాశం ఉన్న వాటిపైనే దృష్టి పెట్టారని విమర్శించారు. రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో బీజేపీ సీట్లు పెంచుకునే దానిపై దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో ఏర్పడబోయే ప్రభుత్వంలో బీజేపీ పాత్ర కచ్చితంగా ఉంటుందని సీఎం రమేష్ స్పష్టం చేశారు.

విష్ణు వర్ధన్ రెడ్డి (Vishnu Vardhan Reddy) మాట్లాడుతూ.. కీలకమైన అనేక మంది నేతలతో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా శ్రీకాళహస్తిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారని చెప్పారు. చిత్తూరు జిల్లా నేతలతో సమావేశం అనంతరం బహిరంగ సభలో జేపీ నడ్డా పాల్గొంటారని విష్ణు వర్ధన్ తెలిపారు.

Updated Date - 2023-06-08T17:13:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising